iDreamPost
android-app
ios-app

దెయ్యం సాయంతో తల్లిని చంపే కూతురు.. OTT లో హై టెన్షన్ హర్రర్ మూవీ!

  • Published Jun 20, 2024 | 7:51 PM Updated Updated Jun 20, 2024 | 7:51 PM

OTT Best Horror Movie: హర్రర్ కంటెంట్ ఇష్టమైతే కనుక ఈ సిరీస్ ను అసలు మిస్ అయ్యి ఉండరు. అందులోను ఈ సినిమా లో నటించింది మరెవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఫేమ్ అవికా గోర్. మరి ఈ సిరీస్ ఏంటో మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

OTT Best Horror Movie: హర్రర్ కంటెంట్ ఇష్టమైతే కనుక ఈ సిరీస్ ను అసలు మిస్ అయ్యి ఉండరు. అందులోను ఈ సినిమా లో నటించింది మరెవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఫేమ్ అవికా గోర్. మరి ఈ సిరీస్ ఏంటో మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

  • Published Jun 20, 2024 | 7:51 PMUpdated Jun 20, 2024 | 7:51 PM
దెయ్యం సాయంతో తల్లిని చంపే కూతురు.. OTT లో హై టెన్షన్ హర్రర్ మూవీ!

హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఎంత భయపడుతున్న సరే… ఈ జోనర్ సినిమాలను మాత్రం చూడకుండా ఉండలేరు ప్రేక్షకులు. ఇక మేకర్స్ కూడా కొత్త కొత్త కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. మరి ఈ జోనర్ వచ్చిన సినిమాలన్నిటిని చూసేసిన కానీ ఇంకా చూడడానికి చాలానే ఉన్నాయంటూ కొన్ని సినిమాలు , సిరీస్ వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే. అందులోను ఈ సినిమా లో నటించింది మరెవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ఫేమ్ అవికా గోర్ మరి ఈ సినిమా ను మీరు చూశారో లేదో.. అసలు ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్ వేసేయండి.

ఈ సినిమా పేరు “1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్”. ఈ సినిమాకు కృష్ణ భట్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో అవికా గోర్ తో పాటు.. రాహుల్ దేవ్, బర్ఖా బిష్ట్, అమిత్ బెల్, అవతార్ గిల్ లాంటి వారు ముఖ్య పాత్ర పోషించారు. సహజంగా హార్రర్ సినిమాలను ఇష్టపడే వారికి 1920 సిరీస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 2008 లో ఈ 1920 సినిమా వచ్చింది. ఆ సినిమాకు విపరీతమైన స్పందన లభించగా.. 2018 వరకు కూడా ఈ ఫ్రాంచైజ్ ను 1921 వరకు నాలుగు సినిమాలుగా కొనసాగించారు. ఇక దీని నుంచి ఐదవ సినిమాగా “1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్” సినిమాను రూపొందించారు. హిందీ తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేశారు మేకర్స్. ఈ సినిమా ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ చూసిన తర్వాత అవికా ఇలాంటి సీన్స్ చేసిందా అని.. ఖచ్చితంగా అందరికి అనిపిస్తుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. అవికా గోర్ తండ్రి ధీరజ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. దానికి కారణం అవికా తల్లి అని ఓ లెటర్ కూడా రాసి పెడతాడు. తండ్రి అంటే ఎంతో ఇష్టమున్న అవికా.. ఆయన చనిపోడంతో.. ఎలాగైనా సరే తన తండ్రి చావుకు కారణం అయినా తల్లిపై పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. దానికోసం తానూ ప్రేమించిన వ్యక్తిని కూడా వదులుకోవడానికి సిద్ధం అవుతుంది. అప్పటికే అవికా తల్లి శంతను అనే ఓ ధనవంతుడిని పెళ్లి చేసుకుందని.. వారికీ ఓ కూతురు కూడా ఉందని తెలుసుకుంటుంది. దీనితో తల్లిపై పగ తీర్చుకోడానికి తండ్రి సహాయం అడుగుతుంది. మరి తన తండ్రి కూతురుకు హెల్ప్ చేస్తాడా ! అసలు ధీరజ్ ఆత్మహత్య చేసుకోడానికి.. అవికా తల్లికి ఏంటి సంబంధం ! అవికా తన కన్న తల్లిపై పగ తీర్చుకుందా లేదా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాను ఇప్పటివరకు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss