iDreamPost
android-app
ios-app

OTT లోకి రానున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘1000 బేబీస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 26, 2024 | 12:30 PM Updated Updated Aug 26, 2024 | 12:30 PM

OTT Telugu New Releases- 1000 Babies Web Series: ఓటీటీ లో ప్రతి వారం ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటున్నాయి. ఇక వీటిలో క్రైమ్ థ్రిల్లర్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ క్రమంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రానుంది. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ఆ సిరీస్ ఏంటో చూసేద్దాం.

OTT Telugu New Releases- 1000 Babies Web Series: ఓటీటీ లో ప్రతి వారం ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు వస్తూనే ఉంటున్నాయి. ఇక వీటిలో క్రైమ్ థ్రిల్లర్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ క్రమంలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ రానుంది. ఈ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. ఆ సిరీస్ ఏంటో చూసేద్దాం.

  • Published Aug 26, 2024 | 12:30 PMUpdated Aug 26, 2024 | 12:30 PM
OTT లోకి రానున్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘1000 బేబీస్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఓటీటీ లలో రిలీజ్ అవుతున్న సిరీస్ లకు, సినిమాలకు ప్రేక్షకులు చూపించే ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. మేకర్స్ కూడా మరింత కొత్తగా ఆలోచిస్తూ.. కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. అందులోను ఇప్పుడు తెలుగు కంటెంట్ కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ప్రతి వారం ఎదో ఒక తెలుగు సినిమా విడుదల అవుతూనే ఉంది. ఇక వీటిలో వెబ్ సిరీస్ లకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగులో రాబోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘1000 బేబీస్’. ఈ సిరీస్ లో నీనా గుప్తా.. రహమాన్ ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్, కాగా ఈ సిరీస్ కు నీజమ్ కొయ్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ ఈ సిరీస్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. అంటే త్వరలోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నారు. ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ సిరీస్ మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన చేయనున్నారు. సెప్టెంబర్ లో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మధ్య ఎలాగూ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్నాయి కాబట్టి ఈ సిరీస్ కూడా కచ్చితంగా.. అందరికి నచ్చేస్తుంది చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఇక ఈ సిరీస్ టీజర్ ను గమనిస్తే.. ఓ అడవి మధ్యలో ఉండే ఓ పెద్ద భవనంలో ఈ కథ స్టార్ట్ అవుతుంది. అక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అది అంతా కూడా డెలివెరీస్ చేసే హాస్పిటల్ ల ఉంటుంది. అక్కడ ఓ మహిళా ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆ బిల్డింగ్ బయట నీనా గుప్తా దేనికో ఆందోళన చెందినట్లుగా ఉంటుంది. అప్పుడే పుట్టిన పిలల్ల ఏడుపులు.. ఆమె చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి. టీజర్ లో అయితే ఈ డీటెయిల్స్ ను మాత్రమే.. హార్ట్ గ్రిప్పింగ్ సీన్స్ తో చూపించారు మేకర్స్. త్వరలోనే ఈ సిరీస్ కు సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ ను రివీల్ చేయనున్నారు. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet