OTT Adult Comedy Movie: మూడేళ్ళ తర్వాత OTT లోకి అడల్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

OTT Adult Comedy Movie: మూడేళ్ళ తర్వాత OTT లోకి అడల్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

అడల్ట్ కంటెంట్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ లో మరొక అడల్ట్ కామెడీ మూవీ రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

అడల్ట్ కంటెంట్ సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ లో మరొక అడల్ట్ కామెడీ మూవీ రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలను చూసేద్దాం.

ఈ మధ్య ఓటీటీ లోకి ఎక్కువగా కామెడీ మూవీస్ వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎలాగూ ప్రేక్షకులంత ఓటీటీ లో భయపెట్టే సినిమాలకు , ఒంటరిగా చూసే సినిమాలకు అలవాటు పడిపోతున్నారు కాబట్టి అలాంటి జోనర్ సినిమాలకు ఆదరణ బాగా లభిస్తుంది. అయితే ఇప్పుడు కామెడీ మూవీస్ ను కూడా అడల్ట్ కంటెంట్ ను యాడ్ చేసి.. ప్రేక్షకులను ఇంకాస్త ఎంటర్టైన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ అడల్ట్ కామెడీ మూవీ రాబోతుంది. అయితే నిజానికి ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి.. మూడేళ్ళ అయింది. కానీ ఇప్పుడు ఓటీటీ లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్ . మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. దానికి సంబంధించిన పూర్తి విషయాలను చూసేద్దాం.

బెంగళూరులో జరిగిన ఓ నిజ జీవిత సంఘటనను ఆధారంగా తీసుకుని.. ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్ . మూడేళ్ళ క్రితం కన్నడలో యావరేజ్ హిట్ గా నిలిచిన ఈ సినిమా పేరు “ఒందు గంటయే కథే”. అసలు ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే.. ఓ మహిళ తన బాయ్ ఫ్రెండ్ తనని కాదని… మరొకరిని పెళ్లి చేసుకున్నాడని.. అతను ప్రైవేట్ పార్ట్ కోసేస్తుంది.. ఇక ఈ పాయింట్ ను ఆధారంగా తీసుకుని.. ఇంత సీరియస్ సబ్జెక్టుకు అడల్ట్ కామెడీగా మార్చి ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. ఇక ఈ సినిమా జులై 5 నుంచి కన్నడ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నమ్మఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్ లో అయితే ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. మరి ఇప్పుడు ఓటీటీ లో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాల్సి ఉంది.

రెగ్యులర్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ , హాట్ స్టార్ లాంటి ప్లాట్ ఫార్మ్స్ ఏ కాకుండా.. ఇంకా ప్రేక్షకులకు తెలియని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ ఉన్నాయి. అటువంటి వాటిలో కన్నడ సినిమాలు మాత్రమే స్ట్రీమింగ్ అయ్యే ప్లాట్ ఫార్మ్ నమ్మఫ్లిక్స్ . ఈ ఓటీటీ లో ఇప్పటివరకు ఎన్నో కన్నడ సినిమాలు , సిరీస్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ సినిమా కూడా జులై 5 నుంచి.. నమ్మఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కన్నడ సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వారు.. ఈ ప్లాట్ ఫార్మ్ ఖచ్చితంగా చూడాల్సిందే. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments