Tirupathi Rao
Netflix Documentary Modern Masters On Rajamouli Trailer Review: నెట్ ఫ్లిక్స్ దర్శకధీరుడు రాజమౌళి గురించి మోడ్రన్ మాస్టర్స్ పేరిట ఒక డాక్యుమెంటరీ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
Netflix Documentary Modern Masters On Rajamouli Trailer Review: నెట్ ఫ్లిక్స్ దర్శకధీరుడు రాజమౌళి గురించి మోడ్రన్ మాస్టర్స్ పేరిట ఒక డాక్యుమెంటరీ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
Tirupathi Rao
దర్శకధీరుడు రాజమౌళి గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. ప్రపంచంలో ఉన్న సినిమా అభిమానులు అందరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాని పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లిన లెజెండరీ డైరెక్టర్ జక్కన్న అనడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ప్రంపంచం మొత్తం జేమ్ కామెరూన్ కి ఫిదా అయితే.. ఆయన మాత్రం రాజమౌళి వర్క్ కి అభిమాని అయిపోయాడు. అతనితో కలిసి పనిచేయాలి అని ఉందని తన మనసులో మాట కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జక్కన్న మీద నెట్ ఫ్లిక్స్ నుంచి ఒక డాక్యుమెంటరీ వస్తోంది. దానికి సంబంధించి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో తెలుగు ప్రేక్షకులకు రాజమౌళి గురించి తెలియని కొన్ని నిజాలను ఆయనతో వర్క్ చేసిన సెలబ్రిటీలు అంతా రివీల్ చేశారు.
నెట్ ఫ్లిక్స్ సంస్థ మోడ్రన్ మాస్టర్స్ పేరిట డాక్యుమెంటరీ తీసుకొస్తొంది. దానిలో టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గురించి డాక్యుమెంటరీ వస్తోంది. దానికి సంబంధించిన ట్రైలర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో రాజమౌళితో వర్కింగ్ కి సంబంధించి ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎంఎం కీరవాణి, రమా రాజమౌళి, నిర్మాత కరణ్ జోహార్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే జేమ్ కామెరూన్ కూడా రాజమౌళి మేకింగ్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ట్రైలర్ లో అందరినీ ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే.. రాజమౌళితో ఏ విషయంలో మీకు ఇబ్బంది కలిగింది అని. ఆ ప్రశ్నకు సెలబ్రిటీలు అంతా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు.
రాజమౌళి ఒక పని రాక్షసుడు అని రమా రాజమౌళి వ్యాఖ్యానించారు. తాను కోరుకున్నది వచ్చే వరకు అతను విశ్రమించడు అనే కోణంలో ఈ కామెంట్స్ చేశారు. ప్రభాస్ అయితే రాజమౌళిలాంటి వ్యక్తిని తాను ఎప్పుడూ కలవలేదని చెప్పాడు. అతను ఒక మ్యాడ్ పర్సన్ అంటూ తన అభిమానాన్ని వెల్లిబుచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే.. రాజమౌళి సినిమాలు తీయడానికి.. ఎవరూ చెప్పని కథలను చెప్పడానికి పుట్టాడు అంటూ కామెంట్ చేశాడు. తనని తాను స్క్రీన్ మీద చూసుకున్నడు తానే నమ్మలేకపోయాను అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. అతను ఇప్పటికే లెజెండ్స్ సరసన చేరిపోయాడని.. అతను ఇప్పుడు ఒక బిగ్గెర్ లెజెండ్ అంటూ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కొనియాడారు.
ఇవన్నీ పక్కన పెడితే రాజమౌళితో పని చేయడంలో ఉన్న పెద్ద తలనొప్పి ఏంటో చెప్పుకొచ్చారు. సెట్స్ లో ఎన్నో మైక్స్ పగిలిపోవడం తాను చూశాను రామ్ చరణ్ చెప్పాడు. తన పక్కన ఉన్నప్పుడు తన వస్తువులు పగలకుండా చాలు అని కోరుకునే వాడట. జూనియర్ ఎన్టీఆర్ అయితే అతని ఎలాంటి దయ, జాలి ఉండవు. తాను కోరుకున్నది రాబట్టుకోవడం, వెళ్లిపోవడం ఇలాగే చేస్తూ ఉంటాడు. అతను ఒక మ్యాడ్ పర్సన్ అంటూ చెప్పాడు. ఈ డాక్యుమెంటరీలో ఇప్పటివరకు రాజమౌళి చేసిన సినిమాలకు సంబంధించి తాను స్వయంగా చేసి చూపించిన ఎన్నో అధ్భుతమైన విజువల్స్ ఉన్నాయి. మగధీరలో బైక్ స్టంట్ తానే స్వయంగా చేసి డెమో ఇవ్వడం ఇక్కడ హైలెట్ అని చెప్పాలి. మరి.. రాజమౌళిపై వస్తున్న ఈ డాక్యుమెంటరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.