iDreamPost
android-app
ios-app

Netflix లో పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కొహ్రా’ కు రెండో సీజన్ వచ్చేస్తుంది..

  • Published Aug 27, 2024 | 2:53 PM Updated Updated Aug 27, 2024 | 2:53 PM

OTT New Releases - Kohra Web Series Season2: వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఏదైనా ఓ వెబ్ సిరీస్ హిట్ అయిందంటే సహజంగానే దానికి సిక్వెల్ గా మరిన్ని సీజన్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న మరొక ఇంట్రెస్టింగ్ సిరీస్ కు రెండవ సీజన్ ను అనౌన్స్ చేశారు.

OTT New Releases - Kohra Web Series Season2: వెబ్ సిరీస్ లకు ఆదరణ బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఏదైనా ఓ వెబ్ సిరీస్ హిట్ అయిందంటే సహజంగానే దానికి సిక్వెల్ గా మరిన్ని సీజన్స్ వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న మరొక ఇంట్రెస్టింగ్ సిరీస్ కు రెండవ సీజన్ ను అనౌన్స్ చేశారు.

  • Published Aug 27, 2024 | 2:53 PMUpdated Aug 27, 2024 | 2:53 PM
Netflix లో పాపులర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కొహ్రా’ కు రెండో సీజన్ వచ్చేస్తుంది..

సినిమాలకంటే కూడా వెబ్ సిరీస్ లను మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు మరింత ఆదరణ లభిస్తుంది. ఏదైనా వెబ్ సిరీస్ బాగా హిట్ అయిందంటే ఇక ఆ సిరీస్ కు.. సిక్వెల్ గా మరిన్ని సీజన్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ కు రెండవ సీజన్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ సిరీస్ మరేదో కాదు.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న కొహ్రా సిరీస్ కు సిక్వెల్. గత సంవత్సరం రిలీజ్ అయినా ఈ సిరీస్ కు.. ఊహించని రెస్పాన్స్ లభించడంతో.. ఇక ఇప్పుడు రెండవ సీజన్ ను ప్రకటించారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో ఇప్పటికే ఎన్నో మంచి వెబ్ సిరీస్ లు.. ప్రేక్షకులను మెప్పించాయి. అలాంటి వెబ్ సిరీస్ ల లిస్ట్ లో ఈ సిరీస్ కూడా ఒకటి. క్రైమ్ కిల్లర్ కథలను ప్రేక్షకులంతా కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ సిరీస్ కూడా సక్సెస్ చేశారు. కొహ్రా సిరీస్ అంతా కూడా బాగా పేరున్న ఓ పంజాబ్ కుటుంబంలో జరిగిన హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ హత్య వెనుక ఉండే మిస్టరీని ఛేదించడానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. ఈ క్రమంలో వారికి అనుకోని విధంగా.. ఆ కుటుంబం గురించి అనేక రహస్యాలు తెలుస్తూ ఉంటాయి. అదే కొహ్రా మొదటి సీజన్. ఇక ఇప్పుడు ఈ సిరీస్ కు రెండవ సీజన్ రాబోతుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియా ఖాతాలో దీనికి సంబంధించిన ఫోటో ను షేర్ చేసింది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఇక కొహ్రా రెండవ సీజన్ విషయానికొస్తే.. ఈ సీజన్ లో కూడా మరొక కుటుంబంలోని హత్య కేసును.. సరికొత్త విధానంలో సాల్వ్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ సీజన్ లో బరుణ్ సోబ్టీ, మోనా సింగ్ లాంటి వారు ప్రధాన పాత్రలో నటించగా.. సుదీప్ శర్మ ఈ సీజన్ కు దర్శకత్వం వహించారు. మొదటి సీజన్ లానే ఈ సీజన్ కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఇప్పటివరకు కొహ్రా మొదటి సీజన్ ను చూడకపోతే కనుక వెంటనే.. నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి. తెలుగులో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉంది. కాబట్టి అసలు మిస్ చేయకండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet