iDreamPost
android-app
ios-app

OTT Dark Comedy Series : ఐదుగురు భార్యలతో హనీమూన్.. OTT లో డార్క్ కామెడీ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Jul 06, 2024 | 4:08 PM Updated Updated Jul 06, 2024 | 4:08 PM

మలయాళ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరొక ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రానుంది. అది కూడా తెలుగులో.. మరి ఆ సిరీస్ ఏంటో ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

మలయాళ సినిమాలు ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే మరొక ఇంట్రెస్టింగ్ డార్క్ కామెడీ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రానుంది. అది కూడా తెలుగులో.. మరి ఆ సిరీస్ ఏంటో ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jul 06, 2024 | 4:08 PMUpdated Jul 06, 2024 | 4:08 PM
OTT Dark Comedy Series : ఐదుగురు భార్యలతో హనీమూన్.. OTT లో  డార్క్ కామెడీ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

మలయాళ సినిమాలు అటు థియేటర్స్ లోను ఇటు ఓటీటీ లలోను తమ సత్తా చాటుతున్నాయి. చిన్న బడ్జెట్ తో తెరమీదకు వచ్చినా కూడా ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ తో పాటు.. మంచి క్రేజ్ ను కూడా సంపాదించుకుంటున్నాయి. ఇక ఓటీటీ లలో అయితే మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏ ఉన్నారు. దీనితో మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ కు తగినట్లు గానే.. సరికొత్త కథలను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇక మలయాళం సినిమాలంటే లవ్ , కామెడీ చిత్రాలే కాదని.. కొన్ని డార్క్ కామెడి చిత్రాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండబోతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ డార్క్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతుంది. పైగా ఈ మలయాళ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. సరికొత్త పాయింట్ తో రాబోతున్న ఈ సిరీస్ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు “నాగేంద్రన్స్ హనీమూన్” . వెబ్ సిరీస్ పేరే కాస్త డిఫరెంట్ గా ఉందంటే.. ఇక ఈ సిరీస్ స్టోరీ లైన్ తెలిస్తే ఇంకాస్త ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ను గమనిస్తే.. ఈ సిరీస్ స్టోరీ లైన్ ఏంటంటే.. పల్లెటూరిలొ ఉండడానికి ఇష్టపడని ఓ వ్యక్తి.. ఫారెన్ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కట్ చేస్తే అతనికి ఐదుగురు అమ్మాయిలతో పెళ్లి కావడం చూపిస్తారు.. మరి అతను ఈ ఐదుగురు అమ్మాయిలను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు. వీరందరితో కలిసి హనీమూన్ కు వెళ్లాడా ఏమో అసలు ఈ కథేంటో తెలియాలంటే.. కనీసం ట్రైలర్ వచ్చేంత వరకైనా వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ వెబ్ సిరీస్ నేరుగా .. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని ఆగష్ట్ 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్. మలయాళంతో పాటు.. తెలుగు , తమిళ భాషల్లో కూడా దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇక ఈ వెబ్ సిరీస్ లో… సూరజ్ వెంజరమూడ్‌ , గ్రేస్ ఆంటోనీ, కని కుశృతి, శ్వేత మీనన్, ఆల్ఫీ పంజికరణ్, నిరంజన అనూప్ లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ వెబ్ సిరీస్ ను రేంజి ఫణిక్కర్ డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ఈ దర్శకుడు మళయాళంలో.. కేరళ క్రైమ్ ఫైల్స్, మాస్టర్ పీస్, పెరిల్లోర్ ప్రీమియర్ లీగ్ లాంటి ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లను తెరకెక్కించాడు ఈ దర్శకుడు. ఈ మూడు వెబ్ సిరీస్ లు కూడా డిస్నీ ప్లస్ హాట్ లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్ లను చూడకపోతే వెంటనే చూసేయండి. మరి ఇప్పుడు రాబోయే నాగేంద్రన్స్ హానిమూన్ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/