iDreamPost
android-app
ios-app

కల్కి-2లో నాలుగో ప్రపంచం! నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Published Jul 15, 2024 | 4:35 PM Updated Updated Jul 15, 2024 | 4:35 PM

Kalki Bujji&Bhairava OTT Update: ప్రస్తుతం థియేటర్స్ లో ఇంకా కల్కి హావ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా మూవీ గురించి ముందే పూర్తిగా అర్థమయ్యేలా.. బుజ్జి&భైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సిరీస్ కు సంబంధించిన మరొక అప్ డేట్ వచ్చేసింది.

Kalki Bujji&Bhairava OTT Update: ప్రస్తుతం థియేటర్స్ లో ఇంకా కల్కి హావ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా మూవీ గురించి ముందే పూర్తిగా అర్థమయ్యేలా.. బుజ్జి&భైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ ను రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సిరీస్ కు సంబంధించిన మరొక అప్ డేట్ వచ్చేసింది.

  • Published Jul 15, 2024 | 4:35 PMUpdated Jul 15, 2024 | 4:35 PM
కల్కి-2లో నాలుగో ప్రపంచం! నాగ్ అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

జూన్ 27న థియేటర్ లో రిలీజ్ అయినా కల్కి 2898AD మూవీ.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ను ఊచకోత కోస్తుంది. నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచానికి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఇప్పటికే ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఎక్కడ చూసిన ఎవరి నోటా విన్న ఇప్పుడు కల్కి నామ స్మరణే జరుగుతుంది. అయితే కల్కి సినిమా రీలిజ్ కంటే ముందు. ఈ సినిమా పూర్తిగా అర్ధమవ్వాలని.. బుజ్జి&భైరవ పేరుతో.. మూవీ మేకర్స్ ఓ యానిమేటెడ్ సిరీస్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ అప్పుడు ఈ సిరీస్ లో కేవలం రెండు ఎపిసోడ్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు. ఇక మిగిలిన రెండు ఎపిసోడ్స్ ఎప్పుడు వస్తాయ అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు నాగ్ అశ్విన్ ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. దానికి సంబంధించిన అప్ డేట్స్ ఇలా ఉన్నాయి.

మే 31 న బుజ్జి&భైరవ పేరుతో.. ఓ యానిమేటెడ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. అసలు కల్కి సినిమాలో ఎం ఉంటుంది. బుజ్జి భైరవ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ సిరీస్ లో చూపించారు. ఈ సిరీస్ మొత్తం నాలుగు ఎపిసోడ్స్ ఉండగా.. వాటిలో కేవలం మొదట రెండు ఎపిసోడ్స్ ను మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రెండు ఎపిసోడ్స్ కు కూడా మంచి స్పందనే లభించింది. ఇక ఇప్పుడు మిగిలిన రెండు ఎపిసోడ్స్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చాడు నాగ్ అశ్విన్. రాబోయే ఈ రెండు ఎపిసోడ్స్ లో కల్కిలోని నాలుగోలోని ప్రపంచం ప్లక్స్ ల్యాండ్ గురించి పరిచయం చేయనున్నట్లుగా చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్. అయితే ఈ ఎపిసోడ్స్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ వస్తాయి అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. దీనికి ఇంకా చాలానే సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కల్కి మొదటి భాగంలో.. కాంప్లెక్స్ పై దాడి జరిగినప్పుడు.. అక్కడి వారందరిని కూడా శంబాలా నుంచి వేరే చోటికి తీసుకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ వేరే ప్రదేశమే ఈ నాలుగో ప్రపంచంలోని ప్లక్స్ ల్యాండ్. దీని గురించి మరిన్ని అప్ డేట్స్ తెలియాలంటే.. ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఇక కల్కి మూవీ పుణ్యమా అని ప్రతి ఒక్కరు మహాభారతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఇద్దరి మధ్య డిస్కషన్ విన్న కూడా అది ఈ విషయం గురించే అయ్యి ఉంటుంది. ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. ఇప్పుడు అందరి ఆశలు ఎదురుచూపులు.. కల్కి 2 మూవీపైనే ఉన్నాయి. మరి ఈ మూవీ గురించి రానున్న రోజుల్లో ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో వేచి చూడాలి. మరి బుజ్జి&భైరవ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetgaranti girişgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibomGrandpashabet Girişgrandpashabet giriş