iDreamPost
android-app
ios-app

Darling Movie OTT: నభా నటేష్ డార్లింగ్ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

  • Published Jul 10, 2024 | 12:49 PM Updated Updated Jul 19, 2024 | 10:43 AM

Darling Movie OTT Partner Locked: ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ లో .. తక్కువ టైమ్ లో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ నభా నటేష్. తాజాగా నభా నటేష్ నటిస్తున్న మూవీ ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే.. ఓటీటీ డీల్ క్లోజ్ అయిపొయింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Darling Movie OTT Partner Locked: ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ లో .. తక్కువ టైమ్ లో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ నభా నటేష్. తాజాగా నభా నటేష్ నటిస్తున్న మూవీ ఇంకా థియేటర్ లో రిలీజ్ కాకముందే.. ఓటీటీ డీల్ క్లోజ్ అయిపొయింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 10, 2024 | 12:49 PMUpdated Jul 19, 2024 | 10:43 AM
Darling Movie OTT: నభా నటేష్ డార్లింగ్ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్..  స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే!

ఓటీటీ లకు రోజు రోజుకి బాగా క్రేజ్ పెరుగుతుంది. ఇంకా థియేటర్ లో సినిమాలు రిలీజ్ కాకముందే.. ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పటివరకు చాలా వరకు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే.. ఓటీటీ డీల్ ను భారీ ధరలకు ముగించేస్తున్నాయి. ఇక థియేటర్ లో ఆయా సినిమాలకు వచ్చే రెస్పాన్స్ ని బట్టి.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ఉంటారు మేకర్స్. ఈ క్రమంలో ఇప్పుడు మరొక సినిమా థియేట్రికల్ రిలీజ్ కు ముందే.. డిజిటల్ హక్కులు భారీ ధరలకు అమ్ముడు పోయాయట. ఆ సినిమా మరేదో కాదు నభ నటేష్ నటించిన డార్లింగ్ మూవీ. మరి ఈ మూవీ హక్కులను ఏ ప్లాట్ ఫార్మ్ కొనుగోలు చేసిందో.. పూర్తి వివరాలను చూసేద్దాం.

ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు. కానీ చాలా కొద్దీ మంది మాత్రమే తక్కువ సమయంలో బాగా క్రేజ్ సంపాదించుకుంటారు. వారిలో ఒకరు నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యూత్ కు బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత నభ నటేష్ చాలా సెలెక్టీవ్ గానే సినిమాలు తీస్తుంది. తనకంటూ స్పెషల్ రోల్ ఉంటే తప్ప ఈ అమ్మడు సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఈ క్రమంలో కెరీర్ లో కొంతకాలం గ్యాప్ కూడా వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె నటిస్తున్న మూవీ “డార్లింగ్“. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కు ఇంకా టైమ్ ఉండగానే.. ఓటీటీ డీల్ పూర్తి చేసుకుంది. డార్లింగ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. అయితే కేవలం  హక్కులతోనే.. ఈ మూవీ మేకింగ్ బడ్జెట్ వచ్చేసిందట.

డార్లింగ్ సినిమాకు 6 కోట్ల బడ్జెట్ తో రూపొందించారట మేకర్స్. ఓటీటీ డీల్ కూడా 6 కోట్లకే క్లోజ్ అయినట్లు సమాచారం. కాబట్టి ఇంకా సినిమా రిలీజ్ కాకముందే మేకర్స్ లాభాల్లో ఉన్నట్లే. కాగా ఈ సినిమాకు రామ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాలో నభ నటేష్.. ప్రియదర్శితో జోడి కట్టింది. ఇప్పటికే రిలీజ్ అయినా డార్లింగ్ ట్రైలర్ అందరికి మెప్పించేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా జూలై 19 న థియేటర్ లో రిలీజ్ అయింది. మరి థియేటర్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో.. ఏ విధమైన టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom