iDreamPost
android-app
ios-app

OTT లోకి ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ సిరీస్.. ‘హనీమూన్ ఫోటోగ్రాఫర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

  • Published Sep 20, 2024 | 4:00 AM Updated Updated Sep 20, 2024 | 4:00 AM

OTT Mystery Web Series- Honeymoon Photographer In Telugu: ఓటీటీ లో మర్డర్ మిస్టరీ కంటెంట్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. వచ్చే సినిమాలు కూడా అలానే ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Mystery Web Series- Honeymoon Photographer In Telugu: ఓటీటీ లో మర్డర్ మిస్టరీ కంటెంట్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. వచ్చే సినిమాలు కూడా అలానే ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటున్నాయి. ఈ క్రమంలో ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Sep 20, 2024 | 4:00 AMUpdated Sep 20, 2024 | 4:00 AM
OTT లోకి ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ సిరీస్.. ‘హనీమూన్ ఫోటోగ్రాఫర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ లోకి కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. వచ్చే సినిమాల జోనర్ సేమ్ అయినా కానీ.. వచ్చే కంటెంట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక వీటిలో హర్రర్ , మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు కదలనివ్వకుండా చూసేలా చేస్తుంటాయి ఈ సినిమాలు. అందుకే వచ్చిన ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ యాడ్ అవ్వబోతుంది. అది కూడా తెలుగులో రాబోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

ఈ సిరీస్ పేరు.. హనీమూన్ ఫోటోగ్రాఫర్ . అర్జున్ శ్రీవాస్తవ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ లో ఆశా నేగి.. అంబికా నాథ్ అనే పాత్రలో నటించింది. ఆమెది ఓ ఫొటోగ్రాఫర్ పాత్ర. ఈ సిరీస్ లో ఈ క్యారెక్టర్ హైలెట్ గా నిలిచింది. కాగా ఈ సిరీస్ లో ఈ సిరీస్ లో ఆశా నేగి, సాహిల్ సలాథియా, రాజీవ్ సిద్ధార్థ, ఆపేక్ష పోర్వల్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. “ఒక ఫొటోగ్రాఫర్, ఒక పిక్చర్ పర్ఫెక్ట్ హనీమూన్. ఇంకా ఓ డెడ్లీ సీక్రెట్. హంతకుడు ఎవరు? హనీమూన్ ఫొటోగ్రాఫర్ సెప్టెంబర్ 27 నుంచి జియో సినిమా ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. పైగా జియో సినిమా ప్లాట్ ఫార్మ్ ఈ సిరీస్ ను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకురానుంది. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఇక ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. భార్యతో కలిసి హ్యాపీగా హనీమూన్ కు వెళ్లిన భర్త.. ఉహిచని విధంగా బీచ్ లో శవమై తేలుతాడు. దీనితో ఈ కేసు అనుమానాస్పదంగా మారుతుంది. ఈ కేసులో ముఖ్యంగా నలుగురు వ్యక్తులను అనుమానితులుగా గుర్తిస్తారు. అతని భార్యతో పాటు .. ఒక ఫ్రెండ్ , ఒక ఫ్యామిలీ మెంబర్ , వాళ్ళను ఫాలో అయ్యే ఒక అపరిచితుడు. అలాగే , అంబికా నాథ్ పెళ్ళైన కొత్త జంటలను ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఈ హత్య వెనుక ఆమె పాత్ర కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అసలు ఈ హత్య ఎవరు చేశారు ? చేస్తే ఎందుకు చేశారు ? దాని వెనుక ఉన్న కారణాలేంటి ? పోలీసులు ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు ? అనే కోణంలో ఈ సిరీస్ కథ కొనసాగబోతుంది. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş