iDreamPost
android-app
ios-app

OTT లో నవ్విస్తూ భయపెట్టే పిల్ల దెయ్యం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jul 30, 2024 | 3:28 PM Updated Updated Jul 30, 2024 | 3:36 PM

OTT Horror Comedy Movie: ప్రత్యేకించి హర్రర్ మూవీ లవర్స్ కోసమే సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అన్నట్లుగా .. ఈ మధ్య వరుసగా ఓటీటీ లో అలాంటి సినిమాలే స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్రర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.

OTT Horror Comedy Movie: ప్రత్యేకించి హర్రర్ మూవీ లవర్స్ కోసమే సినిమాలు రిలీజ్ అవుతున్నాయా అన్నట్లుగా .. ఈ మధ్య వరుసగా ఓటీటీ లో అలాంటి సినిమాలే స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన హర్రర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంది.

  • Published Jul 30, 2024 | 3:28 PMUpdated Jul 30, 2024 | 3:36 PM
OTT లో నవ్విస్తూ భయపెట్టే పిల్ల దెయ్యం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఒకప్పుడు హర్రర్ మూవీస్ అంటే అన్నీ భయపెట్టే సినిమాలే వచ్చేవి.. కానీ ఇప్పుడు ఆ హర్రర్ మూవీస్ భయపెడుతూనే నవ్విస్తున్నాయి కూడా. రీసెంట్ గా థియేటర్స్ లో ఇలాంటి హర్రర్ కామెడీ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సరిగ్గా హార్ట్ గ్రిప్పింగ్ కథతో.. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో కనుక మూవీని తెరకెక్కిస్తే కనుక… ఇక ఆ సినిమాను కొట్టే మూవీ మరొకటి ఉండదు. ఇలాంటి కాన్సెప్ట్ తోనే థియేటర్స్ లో అడుగుపెట్టింది.. ముంజ్యా మూవీ. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఎప్పుడు.. ఏ ఓటీటీ లోకి రానుంది అనే విషయాలను చూసేయండి.

జూన్ 7 న ముంజ్యా మూవీ థియేటర్ లో రిలీజ్ అయింది. కేవలం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. థియేట్రికల్ రన్ క్లోజ్ అయ్యే సమయానికి దాదాపుగా రూ. 131.57 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ.. మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై.. అమర్ కౌశిక్ నిర్మించారు. ఇక ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్‌దార్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయినా ప్రేక్షకులు.. ఓటీటీ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను ఆగష్టు 15 న స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు మేకర్స్. అయితే ప్రస్తుతానికి ఈ సినిమాను హిందీ లాంగ్వేజ్ లోనే స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారట. ఇప్పుడు తెలుగు కంటెంట్ కు కూడా బాగానే ఆదరణ లభిస్తుంది కాబట్టి.. హిందీతో పాటు తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ముంజ్యా అనేది మరాఠీ భాషకు చెందిన పదం.. ముంజ్యా అంటే ఉపనయనం అనే అర్ధం వస్తుంది. సాధారణంగా హిందూ సంప్రదాయంలో ఉండే మగపిల్లలకు కౌమార దశలో వేదాభ్యాసానికి ముందు..ఇలా ఉపనయనం చేయడాన్ని మరాఠిలో ముంజ్యా అని పిలుస్తారు. ఇలా ఉపనయనం చేస్తున్న క్రమంలో ఓ పిల్లవాడు దెయ్యంగా మారిపోతాడు. అయితే ఈ దెయ్యం కేవలం పిల్లలకు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ పిల్ల దెయ్యం ఓ వైపు భయపెడుతూనే.. మరో వైపు నవ్విస్తూ ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరోకు మాత్రమే ఈ పిల్ల దెయ్యం కనిపిస్తుంది. ఆ తర్వాత హీరోకు ఈ పిల్ల దెయ్యంతో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet