iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTT లోకి ముంజ్యా మూవీ డైరెక్టర్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jun 19, 2024 | 11:12 AM Updated Updated Jun 19, 2024 | 11:12 AM

Munjya Director New Movie In OTT: హర్రర్ సినిమాలంటే ఇష్టమైతే కనుక వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ లోకి మరొక హర్రర్ కామెడీ మూవీ డైరెక్ట్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

Munjya Director New Movie In OTT: హర్రర్ సినిమాలంటే ఇష్టమైతే కనుక వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ లోకి మరొక హర్రర్ కామెడీ మూవీ డైరెక్ట్ గా రిలీజ్ కాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jun 19, 2024 | 11:12 AMUpdated Jun 19, 2024 | 11:12 AM
డైరెక్ట్ గా OTT లోకి ముంజ్యా మూవీ డైరెక్టర్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

హర్రర్ మూవీస్ కు అటు థియేటర్స్ లోనే కాకుండా ఇటు ఓటీటీ లోను మంచి డిమాండ్ ఉంది. దీనితో ఇప్పుడు వచ్చే దర్శకులంతా హర్రర్ కామెడీ చిత్రాలపైనా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. వాటిని ఎన్ని విధాలా వీలైతే అన్ని విధాలుగా.. కొత్తగా తెరపైన చూపిస్తూ.. ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నారు. దీనితో ప్రేక్షకులలో ఇంకాస్త ఆసక్తి పెరిగిపోయింది. ఈ మధ్య వచ్చిన ముంజ్యా సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తూ.. థియేటర్స్ లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఆ సినిమా డైరెక్టర్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ కామెడీ హర్రర్ సినిమా.. డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఏంటో ఏ ఓటీటీ లో రిలీజ్ కానుందో చూసేద్దాం.

జూన్ 7 న రిలీజ్ అయినా ముంజ్యా సినిమా.. ఇప్పటికి థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇప్పటికే ఇండియాలో ఈ సినిమా రూ.60 కోట్ల కలెక్షన్స్ ను సాధించింది. మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా.. ఎవరికీ అంచనాలకు అందకుండా… ఈ రేంజ్ లో హైప్ క్రియేట్ చేస్తుందని ఎవరు ఊహించలేదు. ఈ సినిమాను మరాఠీ డైరెక్టర్ ఆదిత్య సర్పోదర్ తెరకెక్కించాడు. ఇప్పుడే అదే డైరెక్టర్ మరో హర్రర్ బేస్డ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే తన నెక్ట్ మూవీని థియేటర్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేయడం విశేషం. ఈ కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు “కాకుడా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ హర్రర్ సినిమాను జీ 5 ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు. “కాకుడా వచ్చే సమయం అయింది. మంగళవారం సాయంత్రం 7.15 గంటలకు తలుపు తీయడం మరచిపోకండి. ఎందుకంటే ఈసారి ప్రతి మగాడు ప్రమాదంలో ఉన్నాడు. కాకుడా త్వరలోనే కేవలం జీ5లో” అంటూ జీ 5 ఈ సినిమా మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.

ఇక ఈ సినిమాలో.. సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ లాంటి ప్రముఖ నటి నటులు నటించనున్నారు. ఇక ఆల్రెడీ విడుదల చేసిన మోషన్ పోస్టర్ ను గమనిస్తే.. ఓ ఊరిలోని క్లాక్ టవర్ ను , దాని ముందు ఉన్న స్ట్రీట్ ను చూపిస్తూ ఉంటారు. అక్కడ ఓ నీడ కనిపిస్తుంది. తర్వాత ఓ ఇంటి తలుపు ఎవరో బాదుతున్నట్లుగా శబ్దాలు వినిపిస్తాయి. కానీ పై నుంచి సడెన్ గా ఓ దెయ్యం పై నుంచి కిందికి వేలాడుతూ కనిపిస్తుంది. అయితే ఇక్కడ కేవలం కాళ్ళ వరకు మాత్రమే చూపించి వదిలేశారు. మరి ఈ సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని తెలియాలంటే.. కనీసం ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకైన వెయిట్ చేయాల్సిందే. ఇక ముంజ్యా మూవీ ఓటీటీ విషయానికొస్తే.. ఈ సినిమా జులై నెలలో ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మరి కాకడా మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss