iDreamPost
android-app
ios-app

OTT లోకి ముంజ్యా డైరెక్టర్ న్యూ మూవీ.. ఈసారి అంతకుమించి! స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

  • Published Jun 21, 2024 | 12:37 PM Updated Updated Jun 21, 2024 | 12:37 PM

హర్రర్ సినిమాలు చూడడం ఇష్టమైన వారికీ మాత్రం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పి తీరాలి. ఎందుకంటే త్వరలో నేరుగా ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ సినిమా రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేద్దాం.

హర్రర్ సినిమాలు చూడడం ఇష్టమైన వారికీ మాత్రం ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పి తీరాలి. ఎందుకంటే త్వరలో నేరుగా ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ హర్రర్ సినిమా రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేద్దాం.

  • Published Jun 21, 2024 | 12:37 PMUpdated Jun 21, 2024 | 12:37 PM
OTT లోకి ముంజ్యా డైరెక్టర్ న్యూ మూవీ.. ఈసారి అంతకుమించి! స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

బాలీవుడ్ రిలీజ్ అయినా హర్రర్ కామెడీ చిత్రం ముంజ్యా మూవీ థియేటర్స్ లో ఏ విధంగా.. కలెక్షన్స్ ను రాబడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూన్ 7 న థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ఇప్పటికే దాదాపు ఈ సినిమా రూ.60 కోట్లకు పైగానే కలెక్షన్స్ ను రాబట్టింది. సినిమా విడుదలయ్యి రెండు వారాలు కావొస్తున్నా కూడా ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో.. దూసుకుపోతుంది ఈ సినిమా.. మినిమమ్ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ను రాబడుతుందని ఎవరు ఊహించలేదు. ముంజ్యా సినిమాను మరాఠీ డైరెక్టర్ ఆదిత్య సర్పోదర్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక ఏ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఇప్పుడు మరో సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

ఆదిత్య సర్పోదర్ ప్రస్తుతం డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేయనున్న సినిమా పేరు “కాకుడా”. తాజాగా ఈ కొత్త వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్ . ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5 లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇక ఇటీవల ఓ మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక మోషన్ పోస్టర్ ను గమనిస్తే.. ఓ ఊరిలోని క్లాక్ టవర్ ను , దాని ముందు ఉన్న స్ట్రీట్ ను చూపిస్తూ ఉంటారు. అక్కడ ఓ నీడ కనిపిస్తుంది. తర్వాత ఓ ఇంటి తలుపు ఎవరో బాదుతున్నట్లుగా శబ్దాలు వినిపిస్తాయి. కానీ పై నుంచి సడెన్ గా ఓ దెయ్యం పై నుంచి కిందికి వేలాడుతూ కనిపిస్తుంది. మరి ఆ తర్వాత అసలు కథ ఏంటి అని.. అంచనా వేయడానికైనా కనీసం ఈ మూవీ ట్రైలర్ వచ్చేవరకైన వెయిట్ చేయాలి. అయితే “కాకుడా” మూవీని జులై 12 నుంచి జీ 5 స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ముంజ్యా మూవీ ఓటీటీ లోకి రాకముందే.. ఆ మూవీ డైరెక్టర్ న్యూ మూవీ నేరుగా ఓటీటీ లో విడుదల కావడం విశేషం. కొత్త దర్శకులు.. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ కు తగినట్లే.. కొత్త కథలను ముందుకు వస్తున్నారు. అందులోను ఇప్పుడు హర్రర్ జోనర్ ను అందరు బాగా టార్గెట్ చేశారు. హర్రర్ అంటే అందరికి గుర్తొచ్చేది దెయ్యాలే. ఈ జోనర్ లో కథలన్నీ ఒకేలా ఉన్నా కూడా.. దర్శకుడు ప్రేక్షకులను కథలోకి తీసుకుని వెళ్లే తీరు మాత్రం.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా ఉంటుంది. ముంజ్యా మూవీ విషయంలో జరిగింది కూడా అదే. మరి ఈసారి రాబోయే కాకుడా మూవీ ప్రేక్షకులలో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetMadridbetMadridbetMadridbetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş