iDreamPost
android-app
ios-app

Mirzapur Season3: మీర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తుంది.. కానీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం !

  • Published Jun 10, 2024 | 9:39 AM Updated Updated Jun 10, 2024 | 9:39 AM

ఓటీటీ హావ మొదలైన తర్వాత.. ఎప్పుడు లేని విధంగా కొన్ని వెబ్ సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగింది. అందులో అందరు బాగా మెచ్చిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్ డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఓటీటీ హావ మొదలైన తర్వాత.. ఎప్పుడు లేని విధంగా కొన్ని వెబ్ సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగింది. అందులో అందరు బాగా మెచ్చిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్ డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

  • Published Jun 10, 2024 | 9:39 AMUpdated Jun 10, 2024 | 9:39 AM
Mirzapur Season3: మీర్జాపూర్ సీజన్ 3 వచ్చేస్తుంది.. కానీ స్ట్రీమింగ్ డేట్ మాత్రం !

వెబ్ సిరీస్ లు ఇప్పుడు అందరికి ప్రత్యేకమే.. ఎందుకంటే వెబ్ సిరీస్ లలో ప్రతి ఎపిసోడ్ లోను ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. దీనితో వెబ్ సిరీస్ లు చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో ఓటీటీ లకు బాగా ఆదరణ పెరిగిపోయింది. దీనితో బాగా హిట్ అయినా వెబ్ సిరీస్ లకు.. ఇప్పుడు సరికొత్త సీజన్స్ ను ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇక ఓటీటీ హావ మొదలైన తర్వాత.. ఎప్పుడు లేని విధంగా కొన్ని వెబ్ సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగింది. అందులో అందరు బాగా మెచ్చిన వెబ్ సిరీస్ మీర్జాపూర్. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అత్యధికమంది చూసిన ఇండియన్ సిరీస్ లో టాప్ లో నిలిచింది. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ఓ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. అదేంటో చూసేద్దాం.

మీర్జాపూర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. రెండవ సీజన్ 2020 లో వచ్చింది. దీనితో మూడవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అందరి వెయిటింగ్ కు ఎండ్ కార్డు పడింది. ఎందుకంటే మీర్జాపూర్ మూడవ సీజన్ వచ్చేస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్సమెంట్స్ ను కూడా చాలా డిఫ్ఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సిరీస్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ కోసం ఓ యానిమేటెడ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది ప్రైమ్ వీడియో. అందులోనే డేట్ కూడా ఉందట. ఆ పోస్టర్ లో మీర్జాపూర్ సిరీస్‍లోని కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తో పాటు.. గన్స్ , జీప్ , కార్పెట్స్ , బులెట్స్ ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి. “మీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ డేట్ ఇందులో దాక్కొని ఉంది. వెతుక్కుంటే వెతుక్కోండి” అంటూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసింది ప్రైమ్ వీడీయో.

ఇక ఈ పోస్టర్ లోని పజిల్ కు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు. పోస్టర్ ను గమనించినట్లయితే.. ఈ పోస్టర్ లో ఏడు గన్ లు ఉన్నాయి. జీప్ నెంబర్ ప్లేట్ పై 7 కనిపిస్తోంది. దీనితో అందరు జులై 7 న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తుందని అంచనా. మరి సరిగ్గా ఎప్పుడు స్ట్రీమింగ్ కు వస్తుందనే దానిపై మేకర్స్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వెబ్ సిరీస్ లో రాహుల్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్, శ్రీయా పిల్గోయాంకర్ లీడ్ రోల్స్ లో నటించారు. మొదటి సీజన్ 2018లో , రెండవ సీజన్ 2020 లో వచ్చింది. ఇప్పటివరకు ఈ రెండు సీజన్స్ ను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ సీజన్ 3 అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap