iDreamPost
android-app
ios-app

Mirzapur Season 3: అఫీషియల్: మీర్జాపుర్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Jun 11, 2024 | 3:22 PM Updated Updated Jun 11, 2024 | 3:22 PM

నిన్న మొన్ననే ఈ వెబ్ సిరీస్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరిగాయి. ఈ మధ్య కాలంలో కొత్త వెబ్ సిరీస్ ల స్ట్రీమింగ్ డేట్స్ ను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మీర్జాపూర్ సీజన్ 3 కు సంబంధించిన అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

నిన్న మొన్ననే ఈ వెబ్ సిరీస్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరిగాయి. ఈ మధ్య కాలంలో కొత్త వెబ్ సిరీస్ ల స్ట్రీమింగ్ డేట్స్ ను సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మీర్జాపూర్ సీజన్ 3 కు సంబంధించిన అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.

  • Published Jun 11, 2024 | 3:22 PMUpdated Jun 11, 2024 | 3:22 PM
Mirzapur Season 3:  అఫీషియల్: మీర్జాపుర్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

మీర్జాపూర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటారు. ఓటీటీ వెబ్ సిరీస్ లను ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ఈ వెబ్ సిరీస్ చాలా స్పెషల్. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ ఆఖరి సీజన్ 2020 లో వచ్చింది. దీనితో మూడవ సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అందరి వెయిటింగ్ కు ఎండ్ కార్డు పడింది. ఎందుకంటే మీర్జాపూర్ మూడవ సీజన్ వచ్చేస్తుంది. ఈ సిరీస్ సీజన్ 3 స్ట్రీమింగ్ డేట్ కోసం ఓ యానిమేటెడ్ పోస్టర్ ను రిలీజ్ చేసింది ప్రైమ్ వీడియో. అందులోనే డేట్ కూడా ఉందట. ఆ పోస్టర్ లో మీర్జాపూర్ సిరీస్‍లోని కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ తో పాటు.. గన్స్ , జీప్ , కార్పెట్స్ , బులెట్స్ ఇంకా కొన్ని వస్తువులు ఉన్నాయి. “మీర్జాపూర్ సీజన్ 3 రిలీజ్ డేట్ ఇందులో దాక్కొని ఉంది. వెతుక్కుంటే వెతుక్కోండి” అంటూ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసింది ప్రైమ్ వీడీయో.

ఆ తర్వాత వారు రిలీజ్ చేసిన యానిమేటెడ్ పోస్టర్ పజిల్ ను.. సాల్వ్ చేస్తూ.. మూవీ లవర్స్ కొన్ని కామెంట్స్ పెట్టారు. ఈ పోస్టర్ లో ఏడు గన్ లు ఉన్నాయి. జీప్ నెంబర్ ప్లేట్ పై 7 కనిపిస్తోంది. దీనితో అందరు జులై 7 న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తుందని అంచనా వేస్తూ.. ఇంకా రకరకాలుగా అంచనాలు వేశారు. దీనితో అసలు స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అంత త్వరగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు లేవని అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. ఈ సిరీస్ అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. “మీర్జాపూర్ సీజన్ 3 ” సిరీస్ ను జులై 5 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఈ వెబ్ సిరీస్ లో రాహుల్ త్రిపాఠి, దివ్యేందు, అలీ ఫజల్, శ్రీయా పిల్గోయాంకర్ లీడ్ రోల్స్ లో నటించారు. మొదటి సీజన్ 2018లో , రెండవ సీజన్ 2020 లో వచ్చింది. ఇక నాలుగేళ్ల తర్వాత మూడవ సీజన్ రాబోతుంది. ఇప్పటివరకు ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ ను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు ఎలాగూ వెబ్ సిరీస్ లను అందరు బాగానే ఆదరిస్తున్నారు కాబట్టి.. ఈ వెబ్ సిరీస్ కూడా మంచి సక్సెస్ అవుతుందని చెప్పేయొచ్చు. మరి ఈ సిరీస్ సీజన్ 3 అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom