iDreamPost
android-app
ios-app

Mirzapur Season 3: మరికొన్ని గంటల్లో OTTలోకి మీర్జాపూర్ సీజన్ 3.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే!

  • Published Jul 03, 2024 | 6:45 PM Updated Updated Jul 03, 2024 | 6:45 PM

వెబ్ సిరీస్ లవర్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎదురుచూపులు.. మరి కొద్దీ గంటల్లో తెరపడనుంది. ఎందుకంటే మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. గత రెండు సీజన్స్ తో పోలిస్తే.. ఈ సిరీస్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండనుందంట.

వెబ్ సిరీస్ లవర్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఎదురుచూపులు.. మరి కొద్దీ గంటల్లో తెరపడనుంది. ఎందుకంటే మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. గత రెండు సీజన్స్ తో పోలిస్తే.. ఈ సిరీస్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండనుందంట.

  • Published Jul 03, 2024 | 6:45 PMUpdated Jul 03, 2024 | 6:45 PM
Mirzapur Season 3: మరికొన్ని గంటల్లో OTTలోకి మీర్జాపూర్ సీజన్ 3.. స్ట్రీమింగ్ టైమ్ ఇదే!

వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల మస్ట్ వాచ్ లిస్ట్ లో ఓ పార్ట్ అయిపోతున్నాయి. ఇప్పటివరకు భాషతో సంబంధం లేకుండా ఎన్నో వెబ్ సిరీస్ లను ప్రేక్షకులు ఆదరించారు. ఇక వాటిలో ప్రేక్షకులకు కొన్ని స్పెషల్ వెబ్ సిరీస్ లు కూడా ఉంటాయి. వాటిలో ఒకటి మీర్జాపూర్. ఇప్పటికే ఈ క్రైమ్ యాక్షన్ వెబ్ సిరీస్ వరుసగా రెండు సీజన్స్ ప్రేక్షకులను.. ఎంతగానో మెప్పించింది. దీనితో మూడవ సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మీర్జాపూర్ సిరీస్ లవర్స్. ఈ క్రమంలో మరికొద్ది గంటల్లో అందరి ఎదురుచూపులు తెరపడనుంది. మీర్జాపూర్ సీజన్ 3 జులై 4 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో.. మీర్జాపూర్ రెండు సీజన్స్ రిలీజ్ అయ్యాయి. అసలు ఈ సిరీస్ లో ఉండే వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కంటే కూడా.. సిరీస్ లో క్యారెక్టర్స్ పేర్లతోనే.. అందరికి బాగా నోటేడ్ అయిపోయారు. ముఖ్యంగా యూత్ అందరి హార్ట్ లో ఈ సిరీస్ కు స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఇక ఈసారి మీర్జాపూర్ సీజన్ 3 తెలుగులో కూడా అందుబాటులో రానుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈ సిరీస్ జులై 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అంటే జులై 4 అర్ధరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్ లో వస్తుందని.. అభిమానులు భావిస్తున్నారు. అటు ఇటుగా అదే సమయంలో స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి డౌట్స్ లేకుండా.. ఎంచక్కా ఈ సీజన్ ను కూడా మీర్జాపూర్ సిరీస్ లవర్స్ హిట్ చేసేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సీజన్ లో గత రెండు సీజన్స్ తో పోలిస్తే.. ఇంకాస్త ఎక్కువ రక్తపాతమే ఉండనుందట.. సో ఈ సీజన్ ను ఒక్కో ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసేయండి.

ఇక మొదటి సీజన్ కథ విషయానికొస్తే.. మొదటి సీజన్ లో కాలీన్ భయ్యాను మాఫియా వరల్డ్ కు లీడర్ గా చూపిస్తారు. అయితే ఓ పెళ్ళిలో అతని కొడుకు మున్నా గన్ పేల్చడంతో పెళ్ళికొడుకు చనిపోతాడు. దీనితో ఆ పెళ్ళికొడుకు కుటుంబం ఓ లాయర్ దగ్గరకు వెళ్లి ఆ కేసును వాదించాలని అడుగుతుంది. అయితే ఆ లాయర్ కు ముగ్గురు పిల్లలు ఉంటారు. కొడుకు చేసిన పనికి కాలిన్ తన సామ్రాజ్యాన్ని ఆ లాయర్ పిల్లలకు ఇచ్చేస్తాడు. దీనితో మున్నా కు కోపం ఆగదు.. ఆ ముగ్గురిని ఎదో ఒకటి చేసి చంపేయాలని అనుకుంటాడు.

ఈ అట్టాక్ లో ఆ పిల్లలలో ఒకరైన బబ్లు చనిపోతాడు. మరో వైపు కాలిన్ ఓ పోలీస్ ఆఫీసర్ ను చంపేస్తాడు. .. ఇక సీజన్ 2 లో మున్నా అటాక్ లో గాయపడిన మరొక ఇద్దరు.. ఓ డాక్టర్ ను కిడ్నప్ చేసి.. అతనితో వైద్యం చేయించుకుంటారు. మున్నపై రివర్స్ అట్టాక్ ప్లాన్ చేస్తారు. దాని నుంచి అతను తప్పించుకుని.. ఎలాగైనా తన తండ్రి సింహాసనాన్ని ఎక్కాలని అనుకుంటాడు. దానికోసం తన తండ్రిని చంపేస్తాడు. సింహాసనంపై కూర్చుంటాడు. మరో వైపు తన తమ్ముళ్లను చంపేసిన కారణంగా.. మున్నపై లాయర్ కొడుకు పగ తీర్చుకోవాలని చూస్తుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సీజన్ 3 లో చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş