iDreamPost
android-app
ios-app

ఓ కుటుంబాన్ని వెంబడించే అతీంద్రియ శక్తులు! OTT సూపర్ సస్సెన్స్ థ్రిల్లర్!

  • Published Jun 04, 2024 | 4:39 PM Updated Updated Jun 04, 2024 | 4:39 PM

తమిళంలో మోస్తారు విజయం సాధించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఆ మూవీస్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. అలాంటి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది.

తమిళంలో మోస్తారు విజయం సాధించిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి ఇక్కడ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఆ మూవీస్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాయి. అలాంటి ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీనే త్వరలో ఓటీటీలో సందడి చేయనుంది.

  • Published Jun 04, 2024 | 4:39 PMUpdated Jun 04, 2024 | 4:39 PM
ఓ కుటుంబాన్ని వెంబడించే అతీంద్రియ శక్తులు!  OTT సూపర్ సస్సెన్స్  థ్రిల్లర్!

థియేటర్లలో రిలీజైన అన్ని సినిమాలను చూడలేని సినీ లవర్స్‌కు.. ఓటీటీలు వరంగా మారాయి. నెల లేదా మూడు/ఆరు నెలల సబ్ స్క్రిప్షన్‌తో నచ్చిన సమయంలో నచ్చినట్లుగా చూడొచ్చు. ఇందులో ఇంటర్వెల్ ఉండదు. ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు.. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు లుక్కేయొచ్చు. థియేటర్లలో సినిమాకు అన్నీ ఛాన్సులు ఉండవు. డబ్బులు పెట్టి.. సినిమా నచ్చినా నచ్చకపోయినా చూడాల్సిందే. మార్చే ఆప్షన్ లేదు. కానీ ఓటీటీ అలా కాదు. నచ్చలేదా.. మరో సినిమాకు షిఫ్ట్ కావొచ్చు. ఇంటిల్లిపాదీ చూడొచ్చు. ఒక్క థియేటర్ ఎక్స్ పీరియన్స్ మారుతుందన్న ఫీలింగ్ తప్ప. ఇక హారర్, సస్పెన్ థ్రిల్లర్ మూవీస్ అయితే.. సీన్ అర్థం కాకపోతే.. వెనక్కు వెళ్లి కూడా చూడొచ్చు.

ఈ వారంలో అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే మీకోసమే ఈ వార్త. ఈ వారంలో ఈ జోనర్ మూవీ రాబోతుంది. 2022లో విడుదల ఈ చిత్రం.. ఏడాది తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రేమిస్తే సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న భరత్ హీరోగా వచ్చిన తమిళ సినిమా మిరల్. 2022 నవంబర్‌లో రిలీజైంది. సోసో అనిపించుకుంది. గత నెల 17న తెలుగు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా వచ్చినట్లు పోయినట్లు కూడా తెలియదు. ఇందులో వాణి భోజన్ హీరోయిన్. ఎం శక్తివేల్ దర్శకత్వం వహించాడు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై జి. డిల్లీ బాబు నిర్మించాడు. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేయనుంది.

ఇప్పటి తమిళ వర్షన్ అందుబాటులో ఉంది. ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. గత నెల 17న తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ మూవీ.. జూన్ 7 నుండి స్రీమింగ్ కానుందని తెలుస్తోది. అదీ కూడా ఆహాలోనే. ఇక సినిమా ప్లాట్ విషయానికి వస్తే.. సివిల్ ఇంజనీర్ హరి (భరత్), రమ (వాణీ) లవ్ మ్యారేజ్. ఓ అపరిచితుడు ముసుగు వేసుకుని వచ్చిన తమ కుటుంబాన్ని హతమార్చినట్లు రమకు కల వస్తుంది. అదే నిజం అవుతుందని భయపడుతుంది. ఇదే సమయంలో హీరో ఓ ప్రమాదం నుండి బయపటడతాడు. జాతకంలో దోషం కారణమని రమ తల్లి చెప్పడంతో ఓ గుడికి వెళతారు. అక్కడ పూజలు చేసి ఓ ముఖ్య మైన పని కోసం అర్థరాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా.. భార్య కలగన్నట్లు ముసుగు వేసుకుంటున్న వ్యక్తి దాడికి దిగుతాడు. ఆ వ్యక్తి ఎవరు.. ఎందుకు హరి ఫ్యామిలీని చంపాలనుకుంటాడు.. అనేది సినిమా వాచ్ చేయాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom