Krishna Kowshik
కామెడీతో కితకితలు పెట్టిస్తున్నాడు అభినవ్ గోమఠం. ఇటీవల విడుదలైన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్‌లో తన ఫన్ క్రియేట్ చేసి ఆకట్టుకున్నాడు ఈ యంగ్ యాక్టర్. అతడు హీరోగా నటించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.
కామెడీతో కితకితలు పెట్టిస్తున్నాడు అభినవ్ గోమఠం. ఇటీవల విడుదలైన సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్‌లో తన ఫన్ క్రియేట్ చేసి ఆకట్టుకున్నాడు ఈ యంగ్ యాక్టర్. అతడు హీరోగా నటించిన ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.
Krishna Kowshik
సునీల్ తరహాలో కామెడీ చేస్తూ నటుడిగా నిరూపించుకుంటున్నాడు అభినవ్ గోమఠం. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ తెలంగాణ కుర్రాడు.. మళ్లీ రావా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అతడి పేరు ఇండస్ట్రీలో మారు మోగేలా చేసిన చిత్రం.. తరుణ్ భాస్కర్ డైరక్షన్‌లో వచ్చిన ఈ నగరానికి ఏమైంది. ఇందులో కౌశిక్‌గా అలరించాడు అభినవ్. ఈ సినిమాలో మస్తు షేడ్స్ రా నీలా.. కమల్ హాసన్ అన్న డైలాగ్ మీమర్లకు వరంగా మారింది. ఇప్పుడు ఇదే డైలాగ్‌తో సినిమా చేసి సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా గత నెల 23న థియేటర్లలో సందడి చేసింది. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వులు పుట్టించిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అభినవ్ సరసన వైశాలి రాజ్ నటించింది.
వంశీ నందిపాటి సమర్పణలో కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల ఈ చిత్రాన్ని నిర్మించారు. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించాడు. తరుణ్ భాస్కర్, అలీ రెజా, నిళ్ గళ్ రవి, రాకెట్ రాఘవ, జ్యోతి రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా మెప్పించిన ఈ చిత్రం తొలి రోజే మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం సుమారు ఐదు కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ పిక్చర్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. మార్చి 29 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే…
మధ్య తరగతి కుటుంబానికి చెందిన మనోహర్ అలియాస్ మను (అభినవ్) చిన్నప్పుడే పెయింటింగ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. పెద్దయ్యాక దాన్నే వృత్తిగా మలచుకుంటాడు. ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ కాగా, పెయింటింగ్ ద్వారా వచ్చే ఆదాయంతో తనను పెంచలేడని భావించి.. పెళ్లికి ముందు రోజు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వెళ్లిపోతుంది. దీంతో అతడి రిచ్ ఫ్రెండ్ రాహుల్ (అలీ రెజా) మనును హేళన చేస్తాడు. దీంతో సొంత ఊళ్లోనే వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలనుకుంటాడు. మరీ ఇంతకు ఆ బిజినెస్ స్టార్ చేశాడా.. ఉమాదేవి (వైశాలి)తో మను ప్రేమ కథ ఏమైంది..? వీరి పెళ్లి పీటలు ఎక్కిందా లేదా అనేది తెరపై చూడాల్సిందే. ఇవన్నీ తెలియాలంటే.. మార్చి 29న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.. అప్పుడు చూసేయండి.