iDreamPost
android-app
ios-app

క్రేజీ న్యూస్.. బిగ్ బాస్ హౌస్ లోకి అభినవ్ గోమఠం?

  • Published Aug 16, 2024 | 9:54 PM Updated Updated Aug 16, 2024 | 9:54 PM

Bigg Boss Telugu Season 8 Contestants- Abhinav Gomatam: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ కి సంబంధించి చాలానే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి అభినవ్ గోమఠం పేరు చేరడంతో ఫ్యాన్స్ తెగ ఆనంద పడిపోతున్నారు.

Bigg Boss Telugu Season 8 Contestants- Abhinav Gomatam: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ కి సంబంధించి చాలానే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి అభినవ్ గోమఠం పేరు చేరడంతో ఫ్యాన్స్ తెగ ఆనంద పడిపోతున్నారు.

  • Published Aug 16, 2024 | 9:54 PMUpdated Aug 16, 2024 | 9:54 PM
క్రేజీ న్యూస్.. బిగ్ బాస్ హౌస్ లోకి అభినవ్ గోమఠం?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వైరల్ అవుతున్న టాపిక్. ఆగస్టు నెల వచ్చింది అంటే బిగ్ బాస్ సీజన్ గురించి బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. సెప్టెంబర్ నెల నుంచి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత దాదాపు 106 రోజులు వారికి ఎంటర్ టైన్మెంట్ కి దిగులు ఉండదు. ఇప్పుడు కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కూడా సెప్టెంబర్ నెల నుంచే ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే రెండు ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. ఎంటర్ టైన్మెంట్ కి లిమిటే లేదు అంటూ హామీ ఇస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈసారి సీజన్ 8ని అంతకు మించి ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ ని సెలక్టివ్ గా తీసుకుంటున్నారంట.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కూడా సీజన్ 7 తరహాలోనే సర్ ప్రైజులు ప్లాన్ చేస్తున్నారంట. నిజానికి సీజన్ 7 కంటే 8ని ఇంకా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. సీజన్ 8లో కంటెస్టెంట్స్ దగ్గరి నుంచి టాస్కుల వరకు అన్నీ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇంక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. దాదాపుగా నేమ్, ఫేమ్ ఉన్నవారినే సెలక్ట్ చేస్తున్నారని లీకులు వస్తున్నాయి. సీరియల్ కేటగిరీ నుంచి సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్, బుల్లితెర కమీడియన్స్ ఇలా చాలానే కేటగిరీలు ఉన్నాయి. అయితే వెండితెర నుంచి కూడా కొందరు వస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా వచ్చిన పేరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతను మరెరవరో కాదు.. అభినవ్ గోమఠం.

అవును అభినవ్ గోమఠం పేరు కూడా ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో వినిపిస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యం అభినవ్ ని సంప్రదించారని చెబుతున్నారు. దాదాపుగా అభినవ్ బిగ్ బాస్ వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఉన్న యంగ్ ఆర్టిస్టుల్లో అభినవ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. మీమర్స్ కి అయితే అభినవ్ ఒక లైబ్రరీ లెక్క. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో.. ఆట్ కమల్ హాసన్’ అనే డైలాగ్ కు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అదే టైటిల్ తో సినిమా కూడా చేశాడు. ఈ మధ్య హీరోగా కూడా సినిమాలు స్టార్ట్ చేశాడు. అయితే అభినవ్ అంత కన్ఫామ్ గా వస్తాడా అంటే? ఏమో ఏం చెప్పలేం. అభినవ్ కి ఉన్న అవకాశాలను బట్టి చూస్తే రాకపోవచ్చు. కానీ, ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం అభినవ్ ని కూడా బిగ్ బాస్ హౌస్ లో చూడొచ్చు. మరి.. అభినవ్ గోమఠం బిగ్ బాస్ లోకి వస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet