iDreamPost
android-app
ios-app

Maname OTT: శర్వానంద్ మనమే మూవీ OTT లోకి వచ్చేది ఎప్పుడంటే !

  • Published Jul 03, 2024 | 12:00 PM Updated Updated Jul 03, 2024 | 12:00 PM

దాదాపు చాలా వరకు సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. కానీ శర్వానంద్ నటించిన మనమే సినిమా గురించి మాత్రం ఇంకా ఎటువంటి టాక్ వినిపించడం లేదు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

దాదాపు చాలా వరకు సినిమాలన్నీ కూడా థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. కానీ శర్వానంద్ నటించిన మనమే సినిమా గురించి మాత్రం ఇంకా ఎటువంటి టాక్ వినిపించడం లేదు. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Jul 03, 2024 | 12:00 PMUpdated Jul 03, 2024 | 12:00 PM
Maname OTT: శర్వానంద్ మనమే మూవీ OTT లోకి వచ్చేది ఎప్పుడంటే !

ఇప్పుడు ఓటీటీ లకు డిమాండ్ బాగా పెరిగింది. థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా దాదాపు నెల రోజుల లోపే ఓటీటీ లో ఎంట్రీ ఇస్తున్నాయి. ఇక ఈ క్రమంలో సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా రోజునే ఆయా సినిమాల ఓటీటీ పార్ట్నర్స్ ఫిక్స్ అయిపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కొన్ని సినిమాలకైతే.. థియేటర్ లో ఇంకా సినిమా రిలీజ్ కాకముందే.. ఓటీటీ డీల్ క్లోజ్ అయిపోతుంది. మరి ఓటీటీ పార్ట్నర్స్ అన్నీ సినిమాల విషయంలో ఇంత ఫాస్ట్ గా ఉన్న క్రమంలో.. ఆల్రెడీ థియేటర్ లో రిలీజ్ అయ్యి.. కొన్ని వారాలు గడిచిపోయినా కొన్ని సినిమాల గురించి మాత్రం ఎటువంటి టాక్ లేదు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి శర్వానంద్ నటించిన మనమే సినిమా యాడ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఇదే అంటూ టాక్ వినిపిస్తుంది.

ఉప్పెన ఫెమ్ కృతి శెట్టి , శర్వానంద్ కలిసి నటించిన సినిమా “మనమే” . ఈ సినిమా జూన్ 7న థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వలేకపోయింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాత్రం యావరేజ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా థియేటర్ లో విడుదలయ్యి దాదాపు నెల కావొస్తున్నా కూడా ఇంకా ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ మాత్రం రాలేదు. ఈ సినిమా తర్వాత విడుదలైన సినిమాలు కూడా ఓటీటీ లోకి వచ్చేసాయి . దీనితో థియేటర్ లో మనమే సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు. ఓటీటీ లో కి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే రీసెంట్ ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేసిందని సమాచారం. అలాగే ఈ సినిమా జులై 12 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.

Maname Into OTT

ఇక మనమే సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీ లో శర్వానంద్ ఎలాంటి బాధ్యతలు లేకుండా… గాలికి తిరుగుతూ, ఇష్టమొచ్చినట్లు తాగుతూ.. కనిపించిన అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ క్రమంలో శర్వానంద్ ఫ్రెండ్, అతని భార్య ఓ యాక్సిడెంట్ లో మరణిస్తారు. వారికి ఓ కొడుకు ఉంటాడు.. అతనిని శర్వానంద్ , కృతి శెట్టి పెంచాల్సి ఉంటుంది. అసలు ఎటువంటి బాధ్యత లేని శర్వానంద్ , అన్ని సరిగ్గా పర్ఫెక్ట్ గా ఉండాలి అనుకునే కృతి కలిసి ఆ పిల్లాడిని ఎలా పెంచారు ! ఈ క్రమంలో వీళ్లిద్దరి మధ్యన ఎలాంటి బాండ్ ఏర్పడుతుంది. చివరకు ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahisJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetmarsbahis giriştaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetJojobet Giriş