iDreamPost
android-app
ios-app

Mammootty: OTTలోకి మ‌మ్ముట్టి లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

  • Published Jul 08, 2024 | 11:12 AM Updated Updated Jul 08, 2024 | 11:12 AM

మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఒకటి ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. ఇంతకు అది ఏ సినిమా.. స్ట్రీమింగ్‌ వివరాలు మీ కోసం..

మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఒకటి ఓటీటీలో విడుదలకు రెడీ అయ్యింది. ఇంతకు అది ఏ సినిమా.. స్ట్రీమింగ్‌ వివరాలు మీ కోసం..

  • Published Jul 08, 2024 | 11:12 AMUpdated Jul 08, 2024 | 11:12 AM
Mammootty: OTTలోకి మ‌మ్ముట్టి లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఓటీటీలకు డిమాండ్‌ పెరిగిన తర్వాత భాషతో సంబంధం లేకుండా.. అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన హిట్టు సినిమాలను ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఓటీటీల్లో మలయాళ సినిమాలు చూసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే.. ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు కూడా మలయాళంలో విడుదలైన సినిమాలను ప్రాంతీయ భాషల్లోకి డబ్‌ చేస్తూ.. విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి హీరోగా నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ఒకటి త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. సుమారు 70 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఏ ఓటీటీలో సందడి చేయనుంది అంటే..

మలయాళ స్టార్‌ హీరో మ‌మ్ముట్టి ప్రధాన పాత్రలో న‌టించిన రీసెంట్‌ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ట‌ర్బో. రెండు నెలల క్రితం విడుదలైన ఈ చిత్రం.. త్వరలోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ మ‌ల‌యాళం మూవీ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సోనీ లివ్ సొంతం చేసుకున్న‌ది. జూలై చివరి వారం, ఆగ‌స్ట్‌లో ట‌ర్బో మూవీని ఓటీటీలో విడుదల చేయ‌బోతున్న‌ట్లు సోనీ లివ్ ప్ర‌క‌టించింది. ఓటీటీ కోసం స్పెష‌ల్‌గా తాజాగా ఓ యాక్ష‌న్ టీజ‌ర్ వీడియోను విడుద‌ల‌చేశారు. ఆగ‌స్ట్ 2 నుంచి మ‌మ్ముట్టి మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ట‌ర్బో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

మే 23న థియేట‌ర్ల‌లో విడుద‌లైన టర్బో సినిమా యావరేజ్‌గా నిలిచింది. సుమారు 70 కోట్ల రూపాయల బడ్టెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలం చెంది.. ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ క్రమంలో సినిమా విడుదలైన దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత ఈ యాక్ష‌న్ మూవీ ఓటీటీలోకి వ‌స్తోంది. ఈ చిత్రంలో మమ్ముట్టి ట‌ర్బో జోస్ క్యారెక్ట‌ర్‌లో నటించాడు. అతడి న‌ట‌న‌, మమ్ముట్టిపై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నా.. కథలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో.. తెలిసిన ట్విస్ట్‌లే ఉండటంతో.. ట‌ర్బో మూవీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయింది.

చాలా రోజుల గ్యాప్ త‌ర్వాత మాస్ క‌థ‌తో మ‌మ్ముట్టి ట‌ర్బో మూవీ చేశాడు. అదొక్క‌టి త‌ప్ప మిగిలిన మిగిలిన అన్ని విష‌యాల్లో ఈ మ‌ల‌యాళం మూవీ రొటీన్ అంటూ విమ‌ర్శ‌లొచ్చాయి. ఇక ట‌ర్బో సినిమాలో అంజ‌నా జ‌య‌ప్ర‌కాష్‌, శ‌బ‌రీష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటి అంటే.. ట‌ర్బో సినిమాకు మమ్ముట్టినే నిర్మాత. దాదాపు 70 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ యాక్ష‌న్ మూవీ రూపొందింది. ట‌ర్బోకు సీక్వెల్ కూడా రాబోతున్న‌ట్లు మేక‌ర్స్ ఆఫీషియ‌ల్‌గా వెల్ల‌డించారు. అయితే ట‌ర్బో ఫ్లాప్‌ కావడంతో..సీక్వెల్ రావ‌డం డౌటే అని మ‌ల‌యాళ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş