iDreamPost
android-app
ios-app

OTT Movie: OTT లోకి రాబోతున్న ప్రేమలు హీరోయిన్ మరొక సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Apr 29, 2024 | 3:04 PM Updated Updated Apr 29, 2024 | 3:04 PM

మలయాళ సినిమాల మ్యాజిక్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించేసింది. ఇప్పుడు ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటించిన మరొక సినిమా త్వరలో ఓటీటీ లోకి రానుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మలయాళ సినిమాల మ్యాజిక్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకర్షించేసింది. ఇప్పుడు ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటించిన మరొక సినిమా త్వరలో ఓటీటీ లోకి రానుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Apr 29, 2024 | 3:04 PMUpdated Apr 29, 2024 | 3:04 PM
OTT Movie: OTT లోకి రాబోతున్న  ప్రేమలు హీరోయిన్ మరొక సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

తెలుగు సినిమాలు ప్రేక్షకులను అలరిస్తాయి అన్న మాట ఎంత వాస్తవమో.. మలయాళీ సినిమాలు తెలుగు ప్రేక్షకుల మదిని దోచేస్తున్నాయి అన్న మాట కూడా అంతే వాస్తవం. ఈ మధ్య కాలంలో అయితే మరీ ఎక్కువగా అందరు మలయాళీ సినిమాలను చూస్తున్నారు. నిన్న మొన్నటివరకు థియేటర్స్ లో కూడా మలయాళీ సినిమాలు.. ప్రేక్షకులను అలరించాయి. ఈ క్రమంలో ఆయా సినిమాలలో క్రేజ్ సంపాదించుకున్న హీరో, హీరోయిన్లు కు సంబంధించిన సినిమాలు ఇంకా ఎమన్నా ఉన్నాయేమో అని.. తెగ సెర్చ్ చేసేస్తున్నారు మూవీ లవర్స్. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు.. ప్రేమలు ఫేమ్ మమిత బైజు నటించిన సినిమా ఒకటి త్వరలోనే ఓటీటీ లోకి రానుందట. మరి ఈ సినిమా ఏంటి ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “ప్రణయ విలాసం”. గత ఏడాది థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి రానుంది. చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా.. థియేటర్స్ లో విడుదలైన పది రోజుల్లోనే.. రూ.2.05 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాలో మమిత బైజుతో పాటు.. అర్జున్ అశోక్ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాను త్వరలో ఓటీటీలోకి రానున్నట్లు స్వయంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్ ఈటీవీ విన్ ప్రకటించింది. “మీ డైరెక్ట్ మెసేజ్‌లు, ప్రశ్నలకు ఇదే మా సమాధానం. తొలి ప్రేమనే ప్రతి ఒక్కరి మనసుల్లో చిరకాలం నిలిచిపోయే ప్రేమగా చెబుతారు. ప్రణయ విలాసం మే 2 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అంటూ.. ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ డేట్ ను ప్రకటించింది ఈటీవీ విన్.

ఇక ప్రణయ విలాసం సినిమా కథ విషయానికొస్తే, తొలి ప్రేమే నిజమైన ప్రేమ అని.. ఆ ప్రేమ కలకాలం నిలిచిపోతుంది అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు మేకర్స్. ఈ సినిమాలో కేవలం హీరో హీరోయిన్స్ మధ్య సాగే ప్రేమ మాత్రమే కాకుండా.. తల్లి దండ్రుల ప్రేమ కూడా ఈ సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారు. మరి వీరి ప్రేమ ఎలా మొదలైంది.. ఎలా సాగింది అనేది చూడాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మమిత బైజుకు ప్రేమలు తర్వాత ఎలాంటి క్రేజ్ పెరుగుతుందో చూస్తూనే ఉన్నాము. మరి ఈ సినిమాలో మమిత ఎలాంటి పాత్రతో ముందుకు వచ్చిందో చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabetgrandpashabet