iDreamPost
android-app
ios-app

KhoKho Movie OTT: OTT లోకి మలయాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ .. తెలుగులో కూడా! స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Jul 15, 2024 | 12:11 PM Updated Updated Jul 15, 2024 | 12:11 PM

ఎప్పుడెప్ప్పుడు ఓటీటీ లోకి కొత్త కథలు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఎప్పుడెప్ప్పుడు ఓటీటీ లోకి కొత్త కథలు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లోకి రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jul 15, 2024 | 12:11 PMUpdated Jul 15, 2024 | 12:11 PM
KhoKho Movie OTT: OTT లోకి మలయాళం స్పోర్ట్స్ డ్రామా మూవీ .. తెలుగులో కూడా! స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ప్రతి వారంలానే ఈ వారం కూడా ఇరవైకి పైగా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవుతూ ఉన్నాయి. దీనితో వారం ముందు నుంచే వీకెండ్ కు ఏ ఏ సినిమాలు చూడాలి అనే ప్లాన్ వేస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఇక ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలను చూద్దామా అనే ఎదురుచూసే ప్రేక్షకుల కోసం.. మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రేక్షకుల ఎంటర్టైన్మెంట్ కు ఎక్కడ లోటు రానివ్వకుండా.. ఇలా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో.. ముందుకు వస్తున్నారు మేకర్స్. ఇక ఏదైనా కొత్త మూవీ ఓటీటీ లోకి వస్తుందంటే.. అది ఏంటో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కామన్ గా ఉంటుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. దానికి సంబందించిన విషయాలను చూసేద్దాం.

మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల మదిలో ఉండే స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా మలయాళీ సినిమా గురించే. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన స్పోర్ట్స్ డ్రామా మూవీ “ఖో ఖో”. ఈ సినిమాలో ప్రేమలు మూవీ ఫేమ్ మమిత బైజు, ర‌వితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీ ఫేమ్ ర‌జిషా విజ‌య‌న్ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాకు రిజి నాయర్ దర్శకత్వం వహించారు. 2021 లోనే ఈ సినిమా థియేటర్ లో విడుదల అయింది. ఆ సమయంలో ఈ మూవీకి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఖో ఖో మూవీ ఓటీటీ లోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ సొంతం చేసుకోగా.. జూలై 25 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఎంచక్కా ఈ స్పోర్ట్స్ డ్రామాను చూసి ఎంజాయ్ చేసేయండి.

ఇక ఖో ఖో మూవీ కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో రజిషా విజయన్ కు అప్పుడే కొత్తగా పెళ్లవుతుంది. తన భర్తకు వచ్చే సంపాదన సరిపోకపోవడంతో… వారి కుటుంబం గడవడం చాలా కష్టమౌతుంది. దీనితో ఆమెకు ఇష్టం లేకపోయినా సరే.. ఓ స్కూల్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా జాబ్ లో జాయిన్ అవుతుంది. ఆ జాబ్ కారణంగా ఆమె జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ స్కూల్ లో ఆమె ఖో ఖో గేమ్ టీచర్ గా ఉంటుంది. అక్కడ మమిత బైజు ఖో ఖో టీమ్ కెప్టెన్ గా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? మమితకు రజిషకు మధ్య ఎలాంటి స్నేహం ఏర్పడింది ? ఆ తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş