iDreamPost
android-app
ios-app

Love Me OTT: నెల రోజుల్లోపే OTT లోకి లవ్ మీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

  • Published Jun 01, 2024 | 11:51 AM Updated Updated Jun 01, 2024 | 11:51 AM

కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. థియేటర్ లో విడుదలైన సినిమాలు మాత్రం నెల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయినా సినిమా గురించి కూడా త్వరలోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అని బజ్ నడుస్తుంది.

కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ.. థియేటర్ లో విడుదలైన సినిమాలు మాత్రం నెల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయినా సినిమా గురించి కూడా త్వరలోనే ఓటీటీ లో స్ట్రీమింగ్ అని బజ్ నడుస్తుంది.

  • Published Jun 01, 2024 | 11:51 AMUpdated Jun 01, 2024 | 11:51 AM
Love Me OTT: నెల రోజుల్లోపే OTT లోకి  లవ్ మీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

గతంలో ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే.. ఆ సినిమాను ఎలా అయినా చూడాలని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్ గా థియేటర్స్ కు వెళ్లి ఆయా సినిమాలను చూసే వారు. కానీ ఇప్పుడు ఓటీటీ లు వచ్చేశాయి.. ఇంట్రెస్ట్ ఉన్న వారు థియేటర్స్ కు వెళ్తున్నారు. లేదంటే ఆయా సినిమాలు ఓటీటీ లోకి వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. ఇక థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా నెల రోజుల తర్వాత ఓటీటీ లోకి రావాలి అనేది రూల్. కానీ ఇప్పుడు చూసినట్లయితే అసలు ఇలా సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో లేదో నెల తిరగకముందే ఓటీటీ లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఇప్పుడు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటించిన “లవ్ మీ” సినిమా పరిస్థితి కూడా అలానే అయింది. ఈ సినిమా ఓటీటీ డేట్ ఇదే అంటూ బజ్ నడుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వైష్ణవి చైతన్య, ఆశిష్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ “లవ్ మీ”. ఈ సినిమా హర్రర్ లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కింది. ట్రైలర్ రిలీజ్ చేసిన దగ్గరనుంచి ఈ సినిమాపై కాస్త అంచనాలు పెంచుకున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా మే 25 న థియేటర్ లో విడుదలైంది. కానీ, అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కాన్సెప్ట్ పరంగా సినిమా బాగున్నా కూడా ప్రెసెంటేషన్ పరంగా అంతగా ఆకట్టుకోలేకపోయిందంటూ టాక్ వినిపించింది. దీనితో అనుకున్న రేంజ్ లో ఈ సినిమా విజయం అందుకోలేకపోయింది. ఇక ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మరి థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఈ బజ్ నడుస్తుంది ఏమో తెలియదు కానీ.. ఈ సినిమా నెల గడవకముందే ఓటీటీ లోకి వస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. లవ్ మీ మూవీ జూన్ 15 లేదా 22 నుంచి ఓటీటీ లో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Love Me

ఇక లవ్ మీ మూవీ కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఓ యూట్యూబర్.. దెయ్యాలు లేవని నిరూపించడానికి.. కొన్ని వీడియోస్ చేస్తూ దాని నుంచి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఓ రోజు తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని ఓ ఊరిలో దివ్యవతి అనే ఓ దెయ్యం ఉందని, ఆమెను చూసిన వారు ప్రాణాలతో తిరిగి రాలేదని హీరోకు తెలుస్తుంది. దీనితో దివ్యవతిని వెతుక్కుంటూ.. హీరో తన అన్నయ్యతో కలిసి ఆ ఊరికి వెళ్తాడు. అక్కడ దివ్యవతి గురించి హీరో ఏం తెలుసుకుంటాడు ? ఆ దెయ్యాన్ని ప్రేమించాలని హీరో ఎందుకు అనుకుంటాడు ? అతని ప్రేమ కథ ఎంత వరకు సాగింది ? ఈ సినిమాలో వైష్ణవికి హీరో కు మధ్య సంబంధమేంటి ? చివరికి ఈ కథ ఎలా ఎండ్ అయింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş