iDreamPost
android-app
ios-app

OTT లో కొరియన్ సిరీస్ ఫెస్టివల్.. ఎప్పుడు- ఎక్కడ చూడాలంటే?

  • Published Aug 01, 2024 | 12:00 AM Updated Updated Aug 01, 2024 | 12:00 AM

OTT Korean Web Series: ఈ మధ్య కాలంలో కొరియన్ సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా యూత్ కె డ్రామాస్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్న కొరియన్ సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

OTT Korean Web Series: ఈ మధ్య కాలంలో కొరియన్ సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా యూత్ కె డ్రామాస్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్న కొరియన్ సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Published Aug 01, 2024 | 12:00 AMUpdated Aug 01, 2024 | 12:00 AM
OTT లో కొరియన్ సిరీస్ ఫెస్టివల్.. ఎప్పుడు- ఎక్కడ చూడాలంటే?

కొరియన్ డ్రామాస్ ఏ మాయ చేస్తున్నాయో తెలియదు కానీ.. ఆ కథలకు ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతున్నారు. ఇప్ప్పుడు కొరియన్ సిరీస్ కు పెరుగుతున్న క్రేజ్ అంత ఇంత కాదు. ముఖ్యంగా అమ్మాయిలు కొరియన్ సిరీస్ అంటే ప్రాణం పెట్టేస్తున్నారు. అంతలా యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తున్నాయి ఈ కొరియన్ సిరీస్. దీనితో అసలు వాటిలో ఏముందా ఎలా ఉంటాయా అని తెలుసుకోవాలనే ఆసక్తి కొంతమందికి కలుగుతుంది. ఇక కొరియన్ మూవీ లవర్స్ అయితే ఎప్పుడెప్పుడు ఏ మూవీ రిలీజ్ అవుతుందా అనే ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ గా ఉన్న కొరియన్ డ్రామాస్ ఏంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో అనే విషయాలు చూసేద్దాం.

ఇన్ ది హౌజ్, నో గెయిన్ నో లవ్:

కొరియన్ సినిమాలలో కేవలం ప్రేమ కథలు మాత్రమే కాదు.. ఇంకా చాలా రకాల ఇంట్రెస్టింగ్ సిరీస్ లు కూడా ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఓ మంచి రొ*మాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ ను చూడాలని అనుకుంటే మాత్రం ఈ సిరీస్ బెస్ట్ ఛాయస్. ఇక ఈ సిరీస్ ఆగష్టు 10 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. దీనితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ సిరీస్ “నో గెయిన్ నో లవ్”.. ఆగష్టు 26 నుంచి.. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి కొరియన్ సిరీస్ లంటే ఇష్టం ఉంటే మాత్రం ఈ సిరీస్ ను మిస్ చేయకుండా చూడండి.

ది ఫ్రాగ్ , నో వే ఔట్:

సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లు చూస్తున్నంత సేపు.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. దీనితో ఈ కాన్సెప్ట్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఇంకా ఇంకా చూడాలని అనుకుంటూ ఉంటారు. అందులోను కొరియన్ మేకర్స్ ఇలాంటి కథలను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన వెబ్ సిరీస్ ఏ “ది ఫ్రాగ్”. ఈ సిరీస్ ఆగష్టు 23 నుంచి… ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక దానితో పాటు.. మరొక ఇంట్రెస్టింగ్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్.. “నో వే అవుట్” సిరీస్ జూలై 31 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

లవ్లీ రన్నర్, టెర్రర్ ట్యూస్‌డే ఎక్స్‌ట్రీమ్:

కొరియన్ సినిమాలు, సిరీస్ లు ప్రేమ కథలకు, హర్రర్ కథలకు పెట్టింది పేరు. వీటిలో ఏం మ్యాజిక్ ఉంటుందో తెలియదు కానీ.. కొరియన్ డ్రామాస్ చూడని వారు కూడా వీటిని చూసిన తర్వాత.. కె డ్రామాస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో లవ్లీ రన్నర్ అనే ఓ లవ్ డ్రామా వెబ్ సిరీస్ జూలై 31 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే టెర్రర్ ట్యూస్‌డే ఎక్స్‌ట్రీమ్ అనే హర్రర్ వెబ్ సిరీస్ ఆగష్టు 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఈ సిరీస్ లను అసలు మిస్ చేయకుండా చూసేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomcasibomgrandpashabetmeritbet girişgrandpashabet