iDreamPost
android-app
ios-app

అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే.. అప్పుడే కల్కి టాప్ 1 లో

  • Published Aug 23, 2024 | 2:31 PM Updated Updated Aug 23, 2024 | 2:31 PM

Top 10 Trending Movies In Amazon Prime: ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అలా రిలీజ్ అవ్వడంతో పాటు కొన్ని సినిమాలు వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి. మరి ఈ వారం అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం.

Top 10 Trending Movies In Amazon Prime: ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయి. అలా రిలీజ్ అవ్వడంతో పాటు కొన్ని సినిమాలు వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాయి. మరి ఈ వారం అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో ఉన్న సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Aug 23, 2024 | 2:31 PMUpdated Aug 23, 2024 | 2:31 PM
అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ ఇవే..  అప్పుడే కల్కి టాప్ 1 లో

ఓటీటీ లకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఎంత థియేటర్స్ లో సినిమాలను చూసినా కానీ.. అవి ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. దీనితో కొన్ని సినిమాలు ఓటీటీ లోకి వచ్చిన వెంటనే ట్రెండింగ్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కల్కి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా కొన్ని గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్ లో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక ఈ సినిమాతో పాటు ట్రెండింగ్ లో ఇంకా ఏ ఏ సినిమాలు ఉన్నాయో చూసేద్దాం.

అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో ఉన్న సినిమాల జాబితా ఇలా ఉంది.

కల్కి 2898AD:

బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ బ్రేక్ చేసి.. కోట్లు కొల్లగొట్టిన సినిమా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చేసింది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు.. ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చి రాగానే చూడడం స్టార్ట్ చేసేశారు. ఆగష్టు 22 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ.. స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా కొద్దీ గంటల్లోనే టాప్ 1 ట్రెండింగ్ లో కొనసాగడం విశేషం. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా కాబట్టి.. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ రికార్డ్స్ ను బ్రేక్ చేసిన ఆశ్చర్యం లేదు.

Top trending movies in OTT

చందు ఛాంపియన్:

ఈ మధ్య రియల్ లైఫ్ స్టోరీస్ ను ఆధారంగా తీసుకుని రూపొందించిన సినిమాలు.. ప్రేక్షకులను బాగానే మెప్పిస్తున్నాయి. వాటిలో ఈ మూవీ కూడా ఒకటి.. 1972 లో ఇండియాలో మొట్ట మొదటి సారి.. పారాలింపిక్ స్వర్ణ పథకాన్ని సాధించిన… ఆర్మీ మ్యాన్ , అథ్లెట్ మురళి కాంత్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన సినిమానే చందు ఛాంపియాన్. ప్రస్తుతం ఈ సినిమా టాప్ 2 ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

Top trending movies in OTT

రాయన్:

ధనుష్ దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించిన మూవీ రాయన్. థియేటర్స్ లో కాసుల వర్షం కురిపించి. సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుని.. ఆగష్టు 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యి 24 గంటలు కూడా కాకుండానే అప్పుడే ఈ మూవీ టాప్ 3 ట్రెండింగ్ లో ఉంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు.. వెంటనే ఓటీటీ లో చూసేయండి.

Top trending movies in OTT

మ‌జై పిడిక్కాథ మ‌ణితాన్:

ఈ మూవీ తమిళ వెర్షన్ ఆగస్ట్ 2 న థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆగస్ట్ 11న తెలుగులో ‘తూఫాన్; అనే పేరుతో ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు.కానీ ఈ మూవీ రెండు వెర్షన్స్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక తెలుగు వెర్షన్ రిలీజ్ అయినా వారం రోజుల్లోనే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ టాప్ 4 ట్రెండింగ్ లో కొనసాగుతుంది. ఓ మంచి స్పై యాక్షన్ థ్రిల్లర్ చూడాలంటే ఈ మూవీ బెస్ట్ ఛాయస్.

Top trending movies in OTT

బెంగళూరు డేస్:

మలయాళంలో ఆల్రెడీ బెంగళూరు డేస్ సినిమాను చూసేసి ఉంటారు. అయితే అదే సినిమాను తమిళ్ లో ఆర్య,శ్రీ విద్య, రానా , సమంత కలిసి రీమేక్ చేశారు. ఇక ఇప్పుడు ఇన్నేళ్లకు ఈ సినిమా తెలుగు వెర్షన్ ను ఓటీటీ లోకి తీసుకుని వచ్చారు మేకర్స్. ఊహించని విధంగా ఈ సినిమా కూడా టాప్ 10 ట్రెండింగ్ లో.. టాప్ 7 స్థానాన్ని దక్కించుకుంది. ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టని సినిమా కాబట్టి.. మరోసారి ఈ మూవీని చూసేయండి.

Top trending movies in OTT

గోళం :

ఈ సినిమాలో దర్శకుడు దగ్గర నుంచి నటి నటుల వరకు అందరూ కొత్తవారే.. అయినా కూడా కమర్షియల్ పరంగా మంచి హిట్ ను అందుకుంది. జూన్ 7 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయినా కూడా టాప్ 8 ట్రెండింగ్ లో ఉండడం విశేషం. ఈ వీకెండ్ ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్.

Top trending movies in OTT

ఇక ఈ సినిమాలు మాత్రమే కాకుండా యాక్షన్ కామెడీ డ్రామా తరహాలో వచ్చిన జాక్ పాట్ మూవీ.. టాప్ 5, సస్పెన్స్ డ్రామా కోటే మూవీ టాప్ 6లో , మరో ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ డ్రామా మైదాన్ టాప్ 9 ట్రెండింగ్ లో, హర్రర్ సస్పెన్స్ డ్రామా 706 మూవీ టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ టాప్ 10 మూవీస్ లో ఏమైనా మిస్ అయ్యి ఉంటే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.