Krishna Kowshik
జైలర్ మూవీ హిట్టుతో జోష్ మీదున్న రజనీకాంత్.. అతిధి పాత్రలో కనిపించిన మూవీ లాల్ సలామ్. కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం చేపట్టిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
జైలర్ మూవీ హిట్టుతో జోష్ మీదున్న రజనీకాంత్.. అతిధి పాత్రలో కనిపించిన మూవీ లాల్ సలామ్. కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం చేపట్టిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
Krishna Kowshik
గత ఏడాది జైలర్ మూవీతో హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆ తర్వాత గెస్ట్ రోల్ పోషించిన సినిమా లాల్ సలామ్. కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న థియేటర్లలో సందడి చేసింది. అయితే ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. కోలీవుడ్ తలైవా అభిమానులు సైతం ఆదరింలేదు. తొలి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో పూర్ కలెక్షన్స్ వచ్చాయి. రూ. 80-90 కోట్ల బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కించగా.. అందులో సగం కూడా వసూలు చేయలేదని తెలుస్తోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కేవలం రెండు కోట్లు మాత్రమే రాబట్టడం గమనార్హం. మొత్తానికి ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్లాప్ కావడానికి 21 రోజుల ఫుటేజ్ మిస్సయ్యిందంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్య.
దీని వల్లే సినిమా ఔట్ పుట్ సరిగా రాలేదని తెలిపింది. దీంతో ట్రోల్స్‌కు కూడా గురైంది ఆమె. ఇక ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత, కెఎస్ రవికుమార్, తంబి రామయ్య, నిరోషా నటీనటులు కీలక పాత్ర పోషించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ అల్లిరాజా నిర్మించారు. ఏఆర్ రెహమాన్ బాణీలు సమకూర్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ విషయంలో కూడా సమస్యలు తలెత్తినట్లు తెలుస్తున్నాయి. సాధారణంగా హిట్ అండ్ ప్లాపు మూవీ అయినా.. థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల్లోనో లేక.. 45 రోజుల్లోపో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ ఈ మూవీ ఓటీటీకి నోచుకోవడం లేదు. సినిమా విడుదలయ్యి దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఓటీటీలో రిలీజ్ కాకపోవడంపై సూపర్ స్టార్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
అయితే గతంలో ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్ అవుతుందని ఈ సినిమా హక్కులు కొన్న సన్ నెక్ట్స్ ప్రకటించింది కూడా. కానీ ఆ రోజు సినిమా ఓటీటీలో ప్రత్యక్షం కాలేదు. దీనికి ఆ ఫుటేజ్ మిస్సింగ్ ఇష్యూనే కారణమని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన అడ్డంకులన్నీ క్లియర్ కావడంతో త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. మే సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్‌లో సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అన్ని భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టులను చేస్తున్నాడు. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో కూలీ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఇటీవలే అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. అలాగే జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో వెట్టయాన్ చేస్తున్నాడు.