iDreamPost
android-app
ios-app

OTT Movie: తెలుగులోకి సూప‌ర్‌ హిట్ కొరియ‌న్ వెబ్‌సిరీస్! రొమాన్స్ ఒక రేంజ్ లో!

  • Published Apr 18, 2024 | 2:29 PM Updated Updated Apr 26, 2024 | 6:22 PM

ఈ మధ్య కాలంలో అందరు కొరియన్ సిరీస్ చూడడం మొదలుపెట్టారు. దీనితో ఇప్పుడు కొరియన్ డ్రామాస్ కు ఆదరణ బాగా పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు కొన్ని కొరియన్ సిరీస్ లు తెలుగులో కూడాస్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మరొక కొరియన్ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ గా ఉంది.

ఈ మధ్య కాలంలో అందరు కొరియన్ సిరీస్ చూడడం మొదలుపెట్టారు. దీనితో ఇప్పుడు కొరియన్ డ్రామాస్ కు ఆదరణ బాగా పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు కొన్ని కొరియన్ సిరీస్ లు తెలుగులో కూడాస్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా మరొక కొరియన్ సిరీస్ తెలుగులో స్ట్రీమింగ్ అవ్వడానికి రెడీ గా ఉంది.

  • Published Apr 18, 2024 | 2:29 PMUpdated Apr 26, 2024 | 6:22 PM
OTT Movie: తెలుగులోకి సూప‌ర్‌ హిట్ కొరియ‌న్ వెబ్‌సిరీస్! రొమాన్స్ ఒక రేంజ్ లో!

ఓటీటీ లో సినిమాలంటే కేవలం తెలుగు, తమిళ, మలయాళ భాషలే కాదు.. వాటితో పాటు ఈ మధ్య కొరియన్ డ్రామాస్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా యూత్ వీటికి బాగా కనెక్ట్ అవుతున్నారు. అవి తెలుగులో లేకపోయినా సరే..వాటిని చూస్తూనే ఉన్నారు. ఒకవేళ తెలుగులో కూడా వస్తే కొరియన్ డ్రామాస్ కు రానున్న రోజుల్లో మరింత ఆదరణ లభిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఒక కొరియన్ సిరీస్.. తెలుగులోకి రాబోతుంది. కొరియాలో ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. మరి ఇప్పుడు తెలుగు మూవీ లవర్స్ కే డ్రామాస్ పై బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి.. ఇకపై తెలుగులో కూడా ఈ సిరీస్ కు మంచి క్రేజ్ లభిస్తుంది. ఇంతకీ అది ఏ సిరీస్.. ఎప్పుడు ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవ్వబోతుంది అనే విషయాల గురించి చూసేద్దాం.

ఈ కొరియన్ సిరీస్ పేరు.. “ఐయామ్ నాట్ ఏ రోబో”. ఈ సిరీస్ 2017 లో రిలీజ్ అయింది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో ఈ సిరీస్ కు 8 రేటింగ్ లభించింది. ఈ సిరీస్ లో మొత్తం 32 ఎపిసోడ్స్ ఉన్నాయి. దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది. అంతేకాకుండా కొరియాలో ఎక్కువమంది చూసిన సిరీస్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సిరీస్ కు జంగ్ డే యూన్ దర్శకత్వం వహించాడు. ఇంత ఆదరణ పొందిన ఈ సిరీస్ కు త్వరలో సీజన్ 2 కూడా ఉండనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ సిరీస్ తెలుగులోకి రాబోతుంది. ఏప్రిల్ 25 నుంచి ఈ ఐయామ్ నాట్ ఏ రోబో వెబ్‌సిరీస్ .. ఈటీవీ విన్ లో ప్రసారం కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ డేట్ ను ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. అది కూడా సరికొత్తగా.. ఈ సిరీస్ ను రిలీజ్ చేస్తున్నట్లు.. చాటింగ్ రూపంలో ప్రకటించింది.

ఇక ఐయామ్ నాట్ ఏ రోబో సిరీస్ కథ విషయానికొస్తే.. మల్టీ మిలినియర్ అయిన ఒక బిజినెస్ మ్యాన్ కు హ్యూమన్ ఎలర్జీ ఉంటుంది. అంటే మనుషులంటే పెద్దగా పడదు. ఎవరితోనూ కలవకుండా.. ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో రోబో పేరుతో ఒక అమ్మాయి వస్తుంది.. ఆమెను రోబో అనుకుని ఆమెతో ప్రేమలో పడతాడు మిలినియర్. మరి అతను నిజం తెలుస్తుందా లేదా ! నిజం తెలిసిన తర్వాత ఏం జరిగింది ! అసలు ఆమె రోబో పేరుతో అతనికి ఎందుకు పరిచయం అయింది ! తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. హీరో హీరోయిన్స్ మధ్య జరిగే రొమాన్స్ , బోల్డ్ సీన్స్ మూవీ లవర్స్ ను ఖచ్చితంగా మెప్పించేస్తాయి. మామూలుగానే లవ్ స్టోరీస్ కు మంచి క్రేజ్ ఉంటుంది. అందులోను ఇది కొరియన్ లవ్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా.. మూవీ లవర్స్ కు ఇది ఒక బెస్ట్ సిరీస్ అవుతుందని చెప్పి తీరాలి. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom