iDreamPost
android-app
ios-app

కల్కి OTT స్ట్రీమింగ్ డేట్ ఇదేనా ! ఎక్కడంటే !

  • Published Aug 03, 2024 | 11:34 AM Updated Updated Aug 03, 2024 | 11:34 AM

Kalki Movie OTT Update: కల్కి సినిమా థియేటర్స్ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో కల్కి OTT రిలీజ్ పై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

Kalki Movie OTT Update: కల్కి సినిమా థియేటర్స్ లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబందించిన అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా కొన్ని థియేటర్స్ లో ఈ సినిమా రన్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో కల్కి OTT రిలీజ్ పై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

  • Published Aug 03, 2024 | 11:34 AMUpdated Aug 03, 2024 | 11:34 AM
కల్కి OTT స్ట్రీమింగ్ డేట్ ఇదేనా ! ఎక్కడంటే !

దాదాపు అందరూ కల్కి సినిమాను థియేటర్స్ లో చూసే ఉంటారు. ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే మూవీ కాబట్టి.. ప్రేక్షకులంతా ఈ సినిమా ఎప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూడడం సహజం. కానీ భారీ బడ్జెట్ సినిమాలు అంత త్వరగా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి.. మరీ ఎక్కువ ఆశలు అయితే పెట్టుకోలేదు. కానీ అప్పుడు ఇప్పుడు అంటూ అడపా దడపా కల్కి ఓటీటీ ఎంట్రీ కి సంబంధించిన డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక డేట్ వినిపిస్తుంది. దాదాపు ఈ స్ట్రీమింగ్ డేట్ కన్ఫర్మ్ అయినట్లే అనే టాక్ అయితే ఉంది. మరి మూవీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడో చూసేద్దాం.

సాధారణంగా థియేటర్ లో రిలీజ్ అయినా ఎనిమిది నుంచి పది వారాల లోపు.. ఆయా సినిమాలు ఓటీటీ ఎంట్రీ ఇవ్వాలి. కానీ కొన్నిసార్లు థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని సినిమాలు.. ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ముందే ఓటీటీ ఎంట్రీ ఇస్తాయి. ఒక్కోసారి సినిమాలు థియేటర్స్ లో సరిగా సక్సెస్ కాలేకపోయినా త్వరగా ఎంట్రీ ఇస్తాయి. ఒక్కోసారి అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయినా సరే ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తాయి.ఈ క్రమంలో కల్కి మూవీ ఇప్పడు రెండవ దశలో ఉంది. అనుకున్న టార్గెట్ ను కల్కి మూవీ ఎప్పుడో రీచ్ అయిపొయింది కాబట్టి.. ఆగష్టు 23 నుంచి ఈ మూవీ హిందీ వెర్షన్ ను నెట్ ఫ్లిక్స్ లోను, మిగిలిన వెర్షన్స్ ను అమెజాన్ ప్రైమ్ లోను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. దాదాపు ఈ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లే అని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

కల్కి సినిమా విషయానికొస్తే.. ఈ సినిమా థియేటర్స్ లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో.. ప్రేక్షకులలో అంత కంటే ఎక్కువ మార్పుని తీసుకొచ్చిందని చెప్పి తీరాలి. ప్రతి ఒక్కరు మహాభారతం గురించి మాట్లాడడం , దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. పైగా ఏ సినిమాకు లేని విధంగా రిలీజ్ కు ముందే మూవీ అర్థంకావాలని.. బుజ్జి&భైరవ పేరుతో యానిమేటెడ్ సిరీస్ రిలీజ్ చేయడం. ఇలా కల్కి మూవీ విషయంలో ప్రతిదీ ప్రత్యేకంగానే నిలిచింది. ఓ రకంగా చెప్పాలంటే ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కావాల్సింది ఇలాంటి సినిమాలే. మరి కల్కి మూవీపై లేటెస్ట్ గా వినిపిస్తున్న ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş