iDreamPost
android-app
ios-app

Kalki Movie OTT: OTT స్ట్రీమింగ్ కు రెడీ అయిన కల్కి మూవీ.. ఎక్కడ చూడాలంటే!

  • Published Jun 05, 2024 | 6:07 PM Updated Updated Jun 05, 2024 | 6:07 PM

మలయాళ సినిమాలకు ప్రేక్షకులలో పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు . దీనితో మేకర్స్ కూడా ఈ సినిమాలపైనే ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ లిస్ట్ లో మరొక సినిమా యాడ్ అవుతుంది.

మలయాళ సినిమాలకు ప్రేక్షకులలో పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు . దీనితో మేకర్స్ కూడా ఈ సినిమాలపైనే ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ లిస్ట్ లో మరొక సినిమా యాడ్ అవుతుంది.

  • Published Jun 05, 2024 | 6:07 PMUpdated Jun 05, 2024 | 6:07 PM
Kalki Movie OTT: OTT స్ట్రీమింగ్ కు రెడీ అయిన కల్కి మూవీ.. ఎక్కడ చూడాలంటే!

ఇప్పుడు మలయాళ సినిమాలకు తెలుగులో చాలామంది అభిమానులు ఉంటున్నారు. దాదాపు మలయాళంలో వచ్చిన అన్ని చిత్రాలు తెలుగులో కూడా డబ్ అవుతున్నాయి. ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఈ క్రేజ్‌ ని అందిపుచ్చుకుని.. ఇప్పుడు పెరుగుతున్న క్రేజ్ చూసి .. ఎప్పుడో మలయాళంలో రిలీజ్ అయిన సినిమాలకు తెలుగు వెర్షన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాయి. అలాంటి డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలయిన కొన్ని గంటల్లోనే మంచి వ్యూస్ కూడా సంపాదిస్తున్నాయి. ఇక ఈ లిస్ట్ లోకి మరొక కొత్త సినిమా యాడ్ అవ్వబోతుంది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు ఓటీటీ లోకి రాబోయే ఈ సినిమా కొత్తగా రిలీజ్ అయింది అయితే కాదు.. 2019 లో వచ్చిన సినిమా ఇది. కానీ ఇప్పుడు తెలుగులో మలయాళీ సినిమాలకు క్రేజ్ బాగా పెరగడంతో.. ఇప్పుడు వాటిని తిరిగి తెలుగులోకి డబ్బింగ్ చేసి.. ఓటీటీ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా పేరు “కల్కి”. అంటే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా కాదు. ఇది వేరే మూవీ. ఈ సినిమా 2019 లో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో టివినో థామస్ హీరోగా.. పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాను జూన్ 6 నుంచి ..ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. కాబట్టి మలయాళ సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే ఈ మూవీ చూసేయండి.

ఇక ఈ సినిమాకు ప్రవీణ్ ప్రభరం దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టోవినో థామస్‌ తో పాటు సంయుక్త మీనన్ నటించారు. అయితే ఆల్రెడీ ఈ సినిమా మలయాళ వెర్షన్ జీ5 లో అందుబాటులో ఉంది. కానీ తెలుగులో ఈ సినిమాను చూడాలి అనుకునే వారు మాత్రం జూన్ 6న ఈటీవీ విన్ లో ఈ సినిమాను చూడొచ్చు. ప్రస్తుతం మలయాళ సినిమాలకు క్రేజ్ బాగానే నడుస్తుంది కాబట్టి.. ఈ సినిమాకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తుంది.. ఈటీవీ విన్. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom