iDreamPost
android-app
ios-app

కల్కిలో కైరాగా చేసిన అన్నా బెన్ బెస్ట్ మూవీస్.. OTTలో ఉన్నాయి చూశారా?

  • Published Jun 29, 2024 | 4:48 PM Updated Updated Jun 29, 2024 | 4:48 PM

Kalki Fame Anna Ben Movies In OTT : ఏదైనా సినిమాలో ఎవరైనా కొత్త హీరోయిన్ కనిపిస్తే చాలు.. ఆమె గురించి సెర్చింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కల్కి లో కైరా అనే పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అమ్మడు.. ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోతుంది.

Kalki Fame Anna Ben Movies In OTT : ఏదైనా సినిమాలో ఎవరైనా కొత్త హీరోయిన్ కనిపిస్తే చాలు.. ఆమె గురించి సెర్చింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో కల్కి లో కైరా అనే పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన అమ్మడు.. ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోతుంది.

  • Published Jun 29, 2024 | 4:48 PMUpdated Jun 29, 2024 | 4:48 PM
కల్కిలో కైరాగా చేసిన అన్నా బెన్ బెస్ట్ మూవీస్.. OTTలో ఉన్నాయి చూశారా?

కల్కి సినిమా.. తెలుగు సినీ ప్రపంచాన్ని మరో లెవెల్ కు తీసుకుని వెళ్లిందని ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉన్నారు. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న నటి నటులందరిని ఈ సినిమాలో చూపించాడు నాగ్ అశ్విన్. ఇక వీరిలో ఒకరు ఆన్నా బెన్ . ఈ సినిమాలో అన్నా బెన్ కనిపించిన నిడివి కొంతసేపైనా సరే.. ఉన్నంత సేపు మాత్రం ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదని చెప్పి తీరాలి. ఏదైనా సినిమాలో ఎవరైనా కొత్త హీరోయిన్ కనిపిస్తే చాలు.. ఆమె గురించి సెర్చింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నా బెన్ గురించి కూడా అలానే సెర్చ్ చేస్తున్నారు. మరి ఆన్నా బెన్ నటించిన ఈ సినిమాలను మీరు చూశారా.. ఈ సినిమాలు ఏ ఓటీటీ లో ఉన్నాయో చూసేద్దాం.

కుంబలంగి నైట్స్ :

ఆన్నా బేన్ నటించిన మొదటి సినిమా ఇది. దాదాపు ఈ సినిమాను అందరు చూసి ఉంటారు. ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ అమ్మాయిగా.. హీరోను గైడ్ చేసే పాత్రలో ఆమె నటించింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

హెలెన్ :

కొన్ని సినిమాలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతూ ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమా మొత్తం కూడా ఒకే పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

కప్పేలా :

ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు… ఓ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రేమ పేరుతో మోసం చేసే వాడి వలలో ఓ అమ్మాయి చిక్కుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా కథ.. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

సారాస్ :

ఈ మూవీ ఇప్పటి జెనెరేషన్ అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుంది. అసలు ఎప్పటికి పిల్లలు వద్దు అనుకునే అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయనేదే ఈ మూవీ కథ. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

నారదన్ :

టీఆర్పీ కోసం కొన్ని మీడియా సంస్థలు చేసే స్కామ్ ల గురించి ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.

మరి ఆన్నా బేన్ నటించిన ఈ సినిమాలలో మీరు ఎన్ని సినిమాలు చూశారు.. ఈ సినిమాలను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయితే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş