iDreamPost
android-app
ios-app

Kalki 2898 AD OTT : అప్పుడే కల్కి మూవీ OTT లోకి వచ్చేస్తుందా ! స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే!

  • Published Jul 10, 2024 | 8:39 AM Updated Updated Jul 10, 2024 | 8:39 AM

నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచం.. ఇప్పుడు ప్రేక్షకులలో సునామి సృష్టిస్తుంది. ఎవరి నోటా విన్నా కానీ ఇదే డిస్కషన్ జరుగుతుంది. అయితే భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. కానీ మేకర్స్ మాత్రం ఓటీటీ విషయంలో భారీ షాక్ ఇచ్చారు.

నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి ప్రపంచం.. ఇప్పుడు ప్రేక్షకులలో సునామి సృష్టిస్తుంది. ఎవరి నోటా విన్నా కానీ ఇదే డిస్కషన్ జరుగుతుంది. అయితే భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఇప్పట్లో ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. కానీ మేకర్స్ మాత్రం ఓటీటీ విషయంలో భారీ షాక్ ఇచ్చారు.

  • Published Jul 10, 2024 | 8:39 AMUpdated Jul 10, 2024 | 8:39 AM
Kalki 2898 AD OTT : అప్పుడే కల్కి మూవీ OTT లోకి వచ్చేస్తుందా ! స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే!

ఇప్పుడు ఏ ఇద్దరి మధ్య డిస్కషన్ విన్నా కానీ.. అది మహాభారతం గురించే అవుతుంది ఇప్పుడు ఇంత మంది మళ్ళీ ఒక్కసారి పురాణాలను గుర్తుచేసుకోడానికి ఏకైక కారణం కల్కి సినిమా. కేవలం ఈ సినిమాను చూసి అర్థంచేసుకోడం కోసమైనా సరే.. ప్రేక్షకులు మరొక్కసారి మహాభారతం గురించి తెలుసుకుంటున్నారు. దీనితో ప్రతి ఒక్కరు నాగ్ అశ్విన్ ను ప్రశంసలతో ముంచేస్తున్నారు. నాగ్ అశ్విన్ సృష్టించిన కల్కి మూవీ ఇప్పుడు ప్రేక్షకులలో సునామి సృష్టిస్తుంది. సినిమా రిలీజ్ అయ్యి 2 వారాలు కావొస్తున్నా కానీ ఇంకా థియేటర్స్ లో ఎక్కడ ఆ ఉత్సాహం తగ్గలేదు. అయితే భారీ బడ్జెట్ సినిమా అందులోను ఇండియన్ హిస్టరీలోనే ఇంత క్రేజ్ తెచ్చేపెట్టిన సినిమా.. ఇప్పట్లో ఓటీటీ లోకి వస్తుంది అనే ఎవరు ఎక్స్పెక్ట్ చెయ్యట్లేదు. కానీ మేకర్స్ మాత్రం ఓటీటీ విషయంలో ప్రేక్షకులకు భారీ షాక్ ఇచ్చారు.

ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ కూడా దాదాపు నెల రోజుల లోపే .. ఓటీటీ ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. మొదట్లో థియేటర్ సినిమాలు ఓటీటీ లోకి రావడం కాస్త సర్ప్రైజ్ అనిపించినా కానీ.. ఇప్పుడు మాత్రం ప్రేక్షకులు దీనికి అలవాటు పడిపోయారు. అయితే భారీ బడ్జెట్ సినిమాల విషయంలో మాత్రం ఎవరు.. త్వరగా ఓటీటీ ఎంట్రీని ఎక్స్పెక్ట్ చేయరు. ప్రభాస్ కల్కి విషయంలో కూడా అందరు ఇలానే అనుకున్నారు. అసలే మూవీ రిలీజ్ కు ముందు.. మూవీ కి సంబంధించి వచ్చిన ప్రతి అప్ డేట్ కూడా.. పోస్ట్ పోన్ అవుతూనే వచ్చింది. కాబట్టి ఓటీటీ ఎంట్రీకి కూడా చాలా ఆలస్యం అవుతుందని అందరు ఫిక్స్ అయిపోయారు, కానీ మేకర్స్ మాత్రం ఈ విషయంలో అందరికి షాక్ ఇచ్చారు. ఈ సినిమాను ఆగష్టు 15 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకుని రానున్నట్లు.. టాక్ వినిపిస్తుంది. దాదాపు ఈ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్లుగానే అనిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజమేనా విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక కల్కి మూవీ రిలీజ్ కు ముందే.. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రెండు ప్లాట్ ఫార్మ్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు.. తమిళ, కన్నడ, మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఒక్క హిందీ వెర్షన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మాత్రం నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఇక కల్కి సృష్టిస్తున్న కలెక్షన్స్ సునామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మూవీ విడుదలైన వారం రోజులకే బ్రేక్ ఈవెన్ ను దాటేసి.. లాభాల పట్టేసింది. ఏదేమైనా ప్రభాస్ సినిమాలు విషయంలో కలెక్షన్స్ రికార్డ్స్ బ్రేక్ చేయడం.. ఈ మధ్య కామన్ అయిపోయింది. మరి కల్కి మూవీ ఇంత త్వరగా ఓటీటీ కి వచ్చేస్తుందా. ఏమో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరి కల్కి మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmarsbahisPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler