iDreamPost
android-app
ios-app

వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అవుతూ దుమ్ము రేపుతున్న కల్కి 2898 AD

  • Published Sep 05, 2024 | 11:36 AM Updated Updated Sep 05, 2024 | 11:36 AM

Kalki 2898 AD Trending Worldwide: థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలైనా.. డిజాస్టర్ అయినా సినిమాలైనా సరే.. చివరికి ఓటీటీ లోకి రావాల్సిందే. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఓటీటీ లోకి వచ్చిన కల్కి మూవీ.. వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అవుతుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

Kalki 2898 AD Trending Worldwide: థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలైనా.. డిజాస్టర్ అయినా సినిమాలైనా సరే.. చివరికి ఓటీటీ లోకి రావాల్సిందే. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఓటీటీ లోకి వచ్చిన కల్కి మూవీ.. వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అవుతుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 05, 2024 | 11:36 AMUpdated Sep 05, 2024 | 11:36 AM
వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అవుతూ దుమ్ము రేపుతున్న కల్కి 2898 AD

ప్రభాస్ సినిమా వస్తుందంటేనే ప్రేక్షకులంతా హైప్ తో అల్లాడిపోతారు. అలాంటిది కల్కి లాంటి సినిమా అయితే ఇక నెక్స్ట్ లెవెల్ క్రేజ్ క్రియేట్ అయినా సంగతి తెలిసిందే. రిలీజ్ తర్వాత కూడా అదే రేంజ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి.. ది బెస్ట్ అనిపించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1,200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి.. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలనే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్ లోనే ఆ రేంజ్ లో హిట్ చేసిన ప్రేక్షకులు.. ఓటీటీ లో మాత్రం ఎందుకు వదులుతారు. స్ట్రీమింగ్ స్టార్ట్ అయినా కొద్దీ సేపటికే రికార్డు వ్యూస్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతూ… టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది ఈ మూవీ.

ఆగస్టు 22 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో హిందీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మిగిలిన అన్ని లాంగ్వేజ్స్ లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీనితో ఈ మూవీ కేవలం ఇండియాలోనే కాకుండా చాలా దేశాల్లోనూ భారీ వ్యూస్ ను దక్కించుకుంటుంది. ఈ రేంజ్ లో ఆదరణ దక్కించుకోవడంతో.. ఇప్పుడు ఈ మూవీ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ కు వచ్చేసింది. ఇప్పటికే ఈ మూవీ మొత్తంగా 7.1మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఒమన్, శ్రీలంక, యూఏఈ సహా మొత్తంగా 11 దేశాల్లో కల్కి మూవీ టాప్ 10లో ట్రెండింగ్ అవుతోంది.ఇక ఇప్పట్లో ఓటీటీ లోకి ఇలాంటి భారీ హిట్ మూవీస్ ఏమి వచ్చేలా లేవు కాబట్టి.. రానున్న రోజుల్లో మరిన్ని వ్యూస్ దక్కించుకునే అవకాశం లేకపోలేదు.

ఇక ఈ సినిమా గురించి ఎలాంటి బజ్ నడిచిందో అందరికి తెలిసిందే. దీనితో ఇప్పుడు పార్ట్-2 మీద అందరికి ఇంకాస్త అంచనాలు పెరిగిపోయాయి. అప్పుడే పార్ట్-2 నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎదురుచూస్తున్నారు. దానికి సంబంధించిన అప్ డేట్స్ ఇప్పట్లో వచ్చేలా లేవు. ఇక అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. సస్వత ఛటర్జీ, దిశా పటానీ, పశుపతి, శోభన, రాజేంద్ర ప్రసాద్, అన్నా బెన్ ఎంతో మంది స్టార్స్ ఈ మూవీలో కనిపించి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారని చెప్పి తీరాలి. మరి నెక్స్ట్ పార్ట్ ఇంకెంత మంది ఇలా సడెన్ సర్ప్రైజ్ చేస్తారో చూడాలి. ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio