iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన ‘జలధార పంప్ సెట్ సిన్స్ 1962’ మూవీ! స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Jalanhara Pumpset Since 1962 In Jio cinema: సీనియర్ నటి ఊర్వశి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆమె నటించిన సెటైరికల్ కామెడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

Jalanhara Pumpset Since 1962 In Jio cinema: సీనియర్ నటి ఊర్వశి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆమె నటించిన సెటైరికల్ కామెడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

OTTలోకి వచ్చేసిన ‘జలధార పంప్ సెట్ సిన్స్ 1962’ మూవీ!  స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు చూసేందుకు సినీ ప్రియులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నరు. ఒక వైపు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటంతో పాటు ఓటీటీలో కూడా  చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే సమయంలో వారం వారం అనేక సినిమాలు ఓటీటీలో రిలీజై సందడి చేస్తుంటాయి. ఈ క్రమంలో ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు కొత్త సినిమాలు వస్తాయా అని మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కొన్ని సినిమా థియేటర్ల విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్ని మాత్రం ఏడాది తరువాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతాయి. ఆ కోవాలకు చెందిన సినిమానే ప్రముఖ నటి ఊర్వశి నటించిన చిత్రం. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జలధార పంప్‍సెట్ సిన్స్ 1962 సినిమా ఏడాది తరువాత నేడు ఓటీటీలోకి వచ్చింది. మరి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

సీనియర్ నటి ఊర్వశి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఆ తరువాత తల్లి, అత్త వంటి వివిధ క్యారెక్టర్లు చేస్తూ..తన సెకెండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే గతేడాది ఊర్వశి ప్రధాన పాత్రలో  ‘జలధార పంప్‍సెట్ సిన్స్ 1962’ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం గతేడాది ఆగస్టులో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాను దర్శకుడు సెటైరికల్ కామెడీ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆశిష్ చిన్నప్ప దర్శకత్వం వహించారు. వండర్‌ఫ్రేమ్స్ ఫిల్మ్ ల్యాండ్ పతాకంపై బైజూ చెల్లమ్మ, సాగర్ రాజన్, సనితా శశిధరన్, ఆర్య పృథ్విరాజ్ సంయుక్తంగా నిర్మించారు. పంప్ సెట్ దొంగతనం కేసు ఏళ్ల పాటు కోర్టులో సాగడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది.

ఇక గతేడాది ఆగష్టులో విడుదలైన ‘జలధార పంప్‍సెట్ సిన్స్ 1962’ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అన్ని సినిమాల మాదిరిగా ఈ సినిమా థియేటర్లలో రిలీజైన తరువాత ఓటీటీలోకి రాలేదు. దాదాపు 13 నెలల తరువాత తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్  అయినా జియోసినిమా లోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్ 15, ఆదివారం ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ చిత్రం జియోసినిమా ఓటీటీలో మలయాళం ఆడియోలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ ఉన్నాయి. ఇక జలధార పంప్‍సెట్ సిన్స్ 1962 సినిమా విషయానికి వస్తే.. మృణాళిని టీచర్ పాత్రలో ఊర్వశి నటించారు.  ఇంద్రన్స్, సనుషా, సాగర్ రాజన్, జానీ ఆంటోనీ, టీజీ రవి, విజయరాఘవన్ వంటి వారు కీలకపాత్రలు పోషించారు. కామెడీ ప్రధానంగానే ఈ మూవీని రూపొందించారు.