iDreamPost
android-app
ios-app

Paruvu Web Series: ఒకరిది ప్రేమ, మరొకరిది పరువు .. OTT లో న్యూ వెబ్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

  • Published Jun 02, 2024 | 5:32 PM Updated Updated Jun 02, 2024 | 5:32 PM

కొత్త కథలను థియేటర్ లు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఓటీటీ లు మాత్రం మెచ్చుకుంటున్నాయి. త్వరలో ఓటీటీ లోకి పరువు అనే వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందొ చూసేద్దాం.

కొత్త కథలను థియేటర్ లు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఓటీటీ లు మాత్రం మెచ్చుకుంటున్నాయి. త్వరలో ఓటీటీ లోకి పరువు అనే వెబ్ సిరీస్ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా దానికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందొ చూసేద్దాం.

  • Published Jun 02, 2024 | 5:32 PMUpdated Jun 02, 2024 | 5:32 PM
Paruvu Web Series: ఒకరిది ప్రేమ, మరొకరిది పరువు .. OTT లో న్యూ వెబ్ సిరీస్ .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే !

ఇప్పుడు థియేటర్ లోకి రాబోయే సినిమాలైనా,ఇటు ఓటీటీ లోకి రాబోయే సినిమాలైన కూడా.. వారి సినిమాలను ప్రమోట్ చేసుకోడానికి చాలా మంది కొత్త కొత్తగా ఆలోచిస్తూ .. క్రియేటివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. ఇక తాజాగా హీరోయిన్ నివేదా పేతురాజ్ పోలీసులతో గొడవపడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్తలు కూడా చూసాము. ఫైనల్ గా అది “పరువు” అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ అని రివీల్ చేశారు. ఇక తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందొ చూసేద్దాం.

పరువు హత్యలకు సంబంధించిన వార్తలను నిత్యం టీవీలలో చూస్తూనే ఉంటాము. సినిమాలను చూసి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయో లేదా బయట జరిగే సంఘటనలు చూసి సినిమాలు తీస్తున్నారో తెలీదు కానీ.. ఈ సినిమా కూడా ప్రేమ పరువు హత్యలకు సంబంధించినదే. హీరో హీరోయిన్లు ఇద్దరూ ప్రేమించుకుంటారు. వారిద్దరి కులాలు వేరు అవ్వడంతో ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరూ ఊహకు అందుతుంది. కానీ ఇంకా ఊహకు అందని ఎలిమెంట్స్ కూడా ఈ సిరీస్ లో ఉండబోతున్నాయని.. ట్రైలర్ ద్వారా చూపించేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులకు ఈ సిరీస్ పైన మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మరి ఈ సిరీస్ విడుదల తర్వాత ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

ఈ సిరీస్ కు సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ దర్శకులుగా వ్యవహరించారు. ఈ సినిమాలో నివేద , నరేష్, నాగబాబు, బిందు మాధవి ఇంకా కొంతమంది ప్రముఖ నటి నటులు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సిరీస్ జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. సో ఈ సిరీస్ ను చూడాలంటే ఇంకా కొద్దీ రోజులు వేచి ఉండాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ సిరీస్ అందరిని ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet