iDreamPost
android-app
ios-app

OTT లోకి IMDB లో 9.1 రేటింగ్ పొందిన హర్రర్ మూవీ.. గూస్ బంప్స్ పక్కా

  • Published Jul 18, 2024 | 3:07 PMUpdated Jul 18, 2024 | 3:07 PM

OTT Horror Thriller : హర్రర్ మూవీస్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఓటీటీ లో చాలానే హర్రర్ మూవీస్ ఉండగా ఇక ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కొత్త హర్రర్ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఆ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Horror Thriller : హర్రర్ మూవీస్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఓటీటీ లో చాలానే హర్రర్ మూవీస్ ఉండగా ఇక ఇప్పుడు మరొక ఇంట్రెస్టింగ్ కొత్త హర్రర్ మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఆ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jul 18, 2024 | 3:07 PMUpdated Jul 18, 2024 | 3:07 PM
OTT లోకి IMDB లో 9.1 రేటింగ్ పొందిన హర్రర్ మూవీ.. గూస్ బంప్స్ పక్కా

ప్రేక్షకులలో ఇప్పుడు హర్రర్ మూవీస్ కు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని.. మేకర్స్ కూడా కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓటీటీ లో ఎన్ని చూసినా తరగని హర్రర్ సినిమాలు ఉండగా.. ఇంకా కొత్త సినిమాలు కూడా యాడ్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇక ఇప్పుడు ఏ భాషలో ఉండే చిత్రాలనైనా చూస్తూనే ఉన్నారు కాబట్టి.. లాంగ్వేజ్ విషయం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మరేదో కాదు.. నాజర్ లీడ్ రోల్ లో నటించిన కోలీవుడ్ మూవీ “ది అకాలి”. మరి ఈ సినిమా ఏ ఓటీటీ లో ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కు రాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

“ది అకాలి” సినిమాకు మ‌హ‌మ్మ‌ద్ ఆసీఫ్ హ‌మీద్ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా మే నెలలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఆ సమయంలో ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాలో ప్రముఖ నటుడు నాజర్ ప్రధాన పాత్రలో నటించగా.. అతనితో పాటు త‌లైవాస‌ల్ విజ‌య్‌, జ‌య‌కుమార్ జాన‌కిరామ‌న్‌, వినోద్ కిష‌న్ ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించిన కానీ.. సరైన ప్రమోషన్స్ లేనందున ఈ సినిమా గురించి అంతగా ఎవరికీ తెలియలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహ తమిళ్ లో జూలై 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికైతే తెలుగు స్ట్రీమింగ్ టాక్ వినిపించడం లేదు కానీ.. త్వరలో వినిపించే అవకాశాలు లేకపోలేదు.

ఇక ది అకాలి సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో జానీస్ అనే అమ్మాయి క్షుద్రపూజలు , కొన్ని అనుకోని శక్తుల కారణంగా.. వరుసగా హత్యలు చేస్తూ ఉంటుంది. దీనితో ఈ హత్యల వెనుక దాగి ఉన్న నిజ నిజాలను ఛేదించేందుకు.. హ‌మ్జా అనే ఓ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అతను ఈ కేసును సాల్వ్ చేస్తున్న క్రమంలో రకరకాల.. నిజాలు బయటపడుతూ ఉంటాయి. అతనికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ? అసలు జానీస్ లోపల ఉన్న ఆత్మ ఎవరిదీ ? అసలు కథ ఏమై ఉంటుంది. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇక ఈ సినిమాకు.. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.1 రేటింగ్ దక్కించుకుంది. మరి ఈ సినిమా ఓటీటీ లో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి