iDreamPost
android-app
ios-app

OTT లోకి వణుకు తెప్పించే హర్రర్ మూవీ ‘పేచీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

  • Published Aug 26, 2024 | 1:02 PM Updated Updated Aug 26, 2024 | 1:02 PM

OTT New Release- Pechi Movie: థియేటర్ ఓటీటీ అని తేడా లేకుండా.. హర్రర్ సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఇటీవల థియేటర్ లో విడుదలైన ఓ హర్రర్ మూవీ ఓటీటీ లోకి రానుంది. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు చూసేద్దాం.

OTT New Release- Pechi Movie: థియేటర్ ఓటీటీ అని తేడా లేకుండా.. హర్రర్ సినిమాలను విపరీతంగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఇటీవల థియేటర్ లో విడుదలైన ఓ హర్రర్ మూవీ ఓటీటీ లోకి రానుంది. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు చూసేద్దాం.

  • Published Aug 26, 2024 | 1:02 PMUpdated Aug 26, 2024 | 1:02 PM
OTT లోకి వణుకు తెప్పించే హర్రర్ మూవీ ‘పేచీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ నెల లోపే ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తున్నాయి. దీనితో చాలా మంది కొత్త సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ కి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా.. జోనర్ తో సంబంధం లేకుండా కథ బావుంటే ఆయా సినిమాలు.. ఓటీటీ లో కూడా మంచి వ్యూస్ ను సంపాదించుకుంటున్నాయి. ఇక వీటిలో హర్రర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో ఇటీవల థియేటర్ లో విడుదలైన హర్రర్ సినిమా ఒకటి ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు ‘పేచీ’. ఈ సినిమాకు బీ రామ‌చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వహించారు. కాగా ఈ సినిమాలో గాయ‌త్రి, బాల‌శ‌ర‌వ‌ణ‌న్‌, దేవ్ రామ్‌నాథ్ ప్రధాన పాత్రలో నటించారు. ఆగస్ట్ 2 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. అనుకున్నట్లుగానే ఆడియన్స్ ను మెప్పించి.. పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. సుమారు ఐదు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 10 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాను అప్పుడే ఓటీటీ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆహా తమిళ్ లో ఆగస్ట్ 29 లేదా 30 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లో కాకుండా నేరుగా ఆహా లోనే రిలీజ్ చేయనున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.

Pechi Movie

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ అంతా కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లోనే కొనసాగుతూ ఉంటుంది. మీనా అనే అమ్మాయి తన నలుగురు స్నేహితులతో కలిసి ఫారెస్ట్ లోకి వెళ్తుంది. అక్కడ మారి అనే వ్యక్తి వారికి గైడ్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. వారంతా కలిసి ఫారెస్ట్ లో తిరుగుతూ ఉన్న క్రమంలో.. వారికి ఓ చోట నిషేదిత ప్రదేశం అనే ఓ బోర్డ్ కనిపిస్తుంది. దానిని చూసి లెక్కచేయకుండా వారంతా కలిసి ఆ ప్రాంతానికి వెళ్తారు. అయితే అక్కడ ఓ భయంకరమైన పేచీ అనే ఆత్మ బంధింపబడి ఉంటుంది. అక్కడికి వెళ్లిన వారు ఆ ఆత్మ కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ తర్వాత ఏమైంది ? అనేదే ఈ సినిమా కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş