iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTT లోకి రానున్న హీరో సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 22, 2024 | 5:16 PM Updated Updated Aug 22, 2024 | 5:16 PM

OTT Upcoming Crime Thriller Movie In Telugu :వెండి తెరపై అలరించిన నటి నటులంతా కూడా.. ఇప్పుడు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటి నటులు నటించిన సినిమాలు , సిరీస్ లు బాగానే హిట్ అవుతున్నాయి. ఇప్పుడు హీరో సుమంత్ డైరెక్ట్ గా ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

OTT Upcoming Crime Thriller Movie In Telugu :వెండి తెరపై అలరించిన నటి నటులంతా కూడా.. ఇప్పుడు ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది నటి నటులు నటించిన సినిమాలు , సిరీస్ లు బాగానే హిట్ అవుతున్నాయి. ఇప్పుడు హీరో సుమంత్ డైరెక్ట్ గా ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.

  • Published Aug 22, 2024 | 5:16 PMUpdated Aug 22, 2024 | 5:16 PM
డైరెక్ట్ గా OTT లోకి రానున్న హీరో సుమంత్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఎంటర్టైన్మెంట్ లో ఓటీటీ ల జోరు కొనసాగుతుంది. అందులోను ఈ మధ్య తెలుగు సినిమాల హావ బాగా నడుస్తుందని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ప్రతి వారం ఎదో ఒక తెలుగు సినిమా రిలీజ్ అవ్వడమే కాకుండా.. డైరెక్ట్ గా కూడా కొన్ని తెలుగు సినిమాలు , సిరీస్ లు ఓటీటీ లో సందడి చేస్తున్నాయి. అందులోను వెండి తెరపై అలరించిన నటీనటులంతా ఓటీటీ లలో దర్శనం ఇవ్వడంతో.. అభిమానాలు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు హీరో సుమంత్ ఓ ఇంట్రెస్టింగ్ మూవీతో.. ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల కానుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చూసేద్దాం.

హీరో సుమంత్.. ఈ మధ్య కాలంలో ఈ హీరో నుంచి వచ్చిన హిట్ చిత్రాలైతే ఏమి లేవు కానీ.. హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా.. కొత్త కొత్త సినిమాలను తీస్తూనే ఉంటాడు. ఇక ఇప్పుడు సుమంత్ మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిపోతున్నాడు. అది కూడా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ను ప్రారంభించినట్లు.. సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక ఈ సినిమాలో సుమంత్ కు జోడిగా.. 2024 బీహార్ మిస్ యూనివర్స్ కాజల్ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో విడుదల చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమా ప్లాట్ విషయానికొస్తే.. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ మధ్య ఎలాగూ ఈ ప్లాట్ లో వచ్చే సినిమాలన్నీ కూడా బాగానే బజ్ సంపాదించుకుంటున్నాయి. అందులోను తెలుగు సినిమా పైగా ప్రస్తుతం ఈటీవీ విన్ లో రిలీజ్ అయ్యే కంటెంట్ కు కూడా బాగానే డిమాండ్ ఉంది.. కాబట్టి ఈ సినిమాకు కూడా మంచి మార్కులు పడే అవకాశం లేకపోలేదు. ఇక ఈ సినిమాను సన్నీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కానీ ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అనే విషయంపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viharsh Yadavalli (@viharsh2013)