iDreamPost
android-app
ios-app

Heeramandi Season 2: హీరామండి సిరీస్ సీజన్ 2 ఫిక్స్! ఈసారి అంతకుమించిన కంటెంట్ తో!

  • Published Jun 04, 2024 | 11:10 AM Updated Updated Jun 04, 2024 | 11:10 AM

ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని వెబ్ సిరీస్ లలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు "హీరామండి:ది డైమండ్ బజార్". ఈ సిరీస్ కు అనూహ్య ఆదరణ లభించడంతో.. ఇప్పుడు ఈ సిరీస్ కు రెండవ సీజన్ ను ప్రకటించారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని వెబ్ సిరీస్ లలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు "హీరామండి:ది డైమండ్ బజార్". ఈ సిరీస్ కు అనూహ్య ఆదరణ లభించడంతో.. ఇప్పుడు ఈ సిరీస్ కు రెండవ సీజన్ ను ప్రకటించారు మేకర్స్. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Jun 04, 2024 | 11:10 AMUpdated Jun 04, 2024 | 11:10 AM
Heeramandi Season 2: హీరామండి సిరీస్ సీజన్ 2 ఫిక్స్! ఈసారి అంతకుమించిన కంటెంట్ తో!

ఈ మధ్య కాలంలో ఓటీటీ లలో వెబ్ సిరీస్ లకు బాగానే ఆదరణ లభిస్తుంది. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ లను చూస్తున్నారు మూవీ లవర్స్. దీనితో మేకర్స్ కూడా వెబ్ సిరీస్ లను కూడా దాదాపు ఓ చిన్న సినిమా తీసిన రేంజ్ లో తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో అన్ని వెబ్ సిరీస్ లలో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు “హీరామండి:ది డైమండ్ బజార్”. సంజయ్ లీల భన్సాలీ భారీ బడ్జెట్ ను కేటాయించి.. దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ కు భారీ స్పందన లభించింది. దీనితో ఈ సిరీస్ కు రెండవ సీజన్ ను ప్రకటించారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

ఏదైనా ఓ వెబ్ సిరీస్ బాగా హిట్ అయిందంటే.. ఆ వెబ్ సిరీస్ కు కంటిన్యుషన్ సీజన్ రావడం కామన్. ఇది ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు హీరామండి వెబ్ సిరీస్ విషయంలోనూ ఇదే జరిగింది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ నెల రోజుల క్రితం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి వారం నుంచే ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ టాప్ 10 లో ట్రెండింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు ఇంకా కంటిన్యుషన్ ఉంటే బావుందని చాలా మంది భావించారు. దీనితో మేకర్స్ కూడా ఈ సిరీస్ కు రెండవ సీజన్ ను ప్రకటించారు. ఈ సీజన్ ప్రకటన కూడా భారీగానే ప్లాన్ చేశారు మేకర్స్. ఈ ప్రకటన ఇవ్వడం కోసం ముంబాయ్‌లో భారీ డ్యాన్స్ ఫీస్ట్‌ను ఏర్పాటు చేశారు. ముంబైలోని రీన్ డ్రైవ్ వద్ద దాదాపు 100 మంది డ్యాన్సర్లు.. హీరమండి సిరీస్ లోని పాటలకు డాన్స్ చేశారు. ఇక ఈ పెరఫార్మెన్స్ ముగిసిన తర్వాత.. సంజయ్ మాట్లాడుతూ.. “1947లో స్వతంత్రం కోసం యుద్ధం ముగిసింది. కానీ ఆడవాళ్ల యుద్ధం మాత్రం ఎప్పుడూ ముగిసిపోదు. ఈసారి ఈ ఆడవాళ్లంతా ఒక కొత్త యుద్ధాన్ని మొదలుపెట్టారు. ఒక కొత్త ప్రపంచంలో తలెత్తుకొని బ్రతకడానికి యుద్ధం ’’ అంటూ చెప్తూ.. సీజన్ 2 తిరిగొస్తుందని ప్రకటించారు సంజయ్. కాబట్టి త్వరలోనే ఈ వెబ్ సిరీస్ సీజన్ 2 కు రాబోతుందన్నమాట.

ఇక హీరామండి సిరీస్ సీజన్ 2 కథ విషయానికొస్తే.. “స్వాతంత్రం వచ్చిన తర్వాత హీరామండిలో నివసించే ఆడవారు అంతా సినిమా ప్రపంచంలోకి వచ్చేస్తారు. అందులో కొందరు ముంబైలోని సినీ పరిశ్రమలో సెటిల్ అయితే, మరి కొంతమందిని కలకత్తాలో సెటిల్ అవుతారు. కానీ వారి జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఒకప్పుడు నవాబులు ముందు డాన్స్ చేస్తే.. ఇప్పుడు నిర్మాతల ముందు డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ” అంటూ హీరమండి సీజన్ 2 స్టోరీ లైన్ ను చెప్పుకొచ్చారు సంజయ్. మరి హీరమండి కొత్త సీజన్ అనౌన్సమెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

Jojobet GirişjojobetcasibomjojobetcasibomcasibomStarzbetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişJojobetPoliwinGrandpashabetGrandpashabetcasibomjojobetCasibom Güncel Giriş