iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన సర్వైవల్ కామెడీ థ్రిల్లర్ ‘గర్‌ర్‌ర్’.. ఈ వీకెండ్ బెస్ట్ ఛాయస్

  • Published Aug 20, 2024 | 11:55 AM Updated Updated Aug 20, 2024 | 12:24 PM

OTT Survival Comedy Thriller Grrr In Telugu: మలయాళ సినిమాలు చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి సర్వైవల్ థ్రిల్లర్ వచ్చేసింది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

OTT Survival Comedy Thriller Grrr In Telugu: మలయాళ సినిమాలు చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ లోకి సర్వైవల్ థ్రిల్లర్ వచ్చేసింది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 20, 2024 | 11:55 AMUpdated Aug 20, 2024 | 12:24 PM
OTTలోకి వచ్చేసిన సర్వైవల్ కామెడీ థ్రిల్లర్ ‘గర్‌ర్‌ర్’.. ఈ వీకెండ్ బెస్ట్ ఛాయస్

ఈ వారం ఓటీటీ లోకి ఇంట్రెస్టింగ్ మూవీస్ వచ్చేశాయి. వాటిలో ఎక్కువగా ఉండడం విశేషం. ఇక వీటిలో తెలుగు డబ్బింగ్ లో వచ్చిన మలయాళీ సినిమాలంటే మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు.. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఓ మలయాళీ సర్వైవల్ థ్రిల్లర్ డ్రామా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. సాధారణంగానే సర్వైవల్ డ్రామాస్ ను ఆసక్తిగా చూస్తూ ఉంటారు. అలాంటిది తెలుగులో ఉందంటే మరింత ఆసక్తి కనబరుస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి ఈ వారం మీ వాచ్ లిస్ట్ లో ఈ మూవీని కూడా యాడ్ చేసుకోండి.. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. అనే విషయాలను చూసేద్దాం.

ఓటీటీ లోకి వచ్చేసిన ఈ సినిమా పేరు ‘గర్‌ర్‌ర్’. కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన గర్‌ర్‌ర్ సినిమా ఐదు రోజుల్లో రూ. 2.85 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ సృష్టించింది. జూన్ 14 న థియేటర్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కాగా ఈ సినిమాలో పాపులర్ నటుడు సూరజ్ వెంజరమూడ్, కుంచాకో బోబన్ మెయిన్ లీడ్స్ లో నటించారు. మళయాళంతో పాటు ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆగస్ట్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఎంచక్కా ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను అసలు మిస్ కాకుండా చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ఈ మూవీ కథ అంతా కేరళలోని తిరువనంతపురం జూ లో సాగుతుంది . రెజిమన్ అనే వ్యక్తి తన ప్రియురాలు మోసం చేసిందని.. ఫుల్ గా తాగేసి జూ కు వెళ్లి అక్కడ సింహం ఉన్న జోన్ లోని కంచెను దాటేస్తాడు. అతనిని కాపాడడానికి జూ అధికారి హరిదాస్ కూడా ఆ కంచె దాటి వెళ్తాడు. దీనితో ఇద్దరు అనుకోకుండా ప్రమాదంలో చిక్కుకుపోతారు. వీరిని కాపాడడానికి అధికారులు ఎలాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు . చివరికి వారు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారా ! అధికారులు ఎలాంటి ప్రప్రయత్నాలు చేశారు ? సింహం నుంచి వీరు తప్పించుకున్నారా లేదా? ఆ తర్వాత ఏం జరిగింది ? అనేది తెరపై చూడాల్సిన కథ. మరి ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.