Swetha
ఓటీటీ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తూ ఉన్నా సరే.. కేవలం కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రం మరేదో కాదు జపాన్ చిత్రమైన "గాడ్జిల్లా మైనస్ వన్". ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి వస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
ఓటీటీ లో ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తూ ఉన్నా సరే.. కేవలం కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రం మరేదో కాదు జపాన్ చిత్రమైన "గాడ్జిల్లా మైనస్ వన్". ఈ సినిమా త్వరలోనే ఓటీటీ లోకి వస్తున్నట్లు టాక్ నడుస్తుంది.
Swetha
ఇండియన్స్ అంతా ఇప్పుడు ఇతర భాషల చిత్రాలు, సిరీస్ లు చూసేందుకు మరింత ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలే కాకుండా కొరియన్, జాపనీస్ చిత్రాలను చూడడానికి కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. నిత్యం ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తున్నా సరే.. ప్రేక్షకులు మాత్రం కొన్ని సినిమాలు ఓటీటీ లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో 2023 లో విడుదలైన ఓ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటైన “గాడ్జిల్లా మైనస్ వన్” కూడా ఒకటి. ఇలాంటి చిత్రాలు కేవలం హాలీవుడ్ , బాలీవుడ్ వారు మాత్రమే తీయగలరని టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిక్స్ అయిన తర్వాత.. జపాన్ మేకర్స్ తాము కూడా ఓ మంచి సినిమా తీయగలం అని నిరూపించిన సినిమానే ఈ గాడ్జిల్లా మైనస్ వన్. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ గురించి టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.
గాడ్జిల్లా మైనస్ వన్ సినిమాను తకాషీ యమజాకీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా 2023 లో జపాన్ లో మాత్రమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కూడా విడుదలయ్యింది. ఆ సమయంలో ఈ సినిమా హ్యుజ్ సక్సెస్ ను సాధించింది. గాడ్జిల్లా ఫ్రాంచైజ్‌లో 37వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక దీనిని థియేటర్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి వస్తుందా.. కనీసం ఓటీటీ లో అయినా ఈ సినిమాను చూడాలని ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకులు ఇంకా ఎక్కువ కాలం వెయిట్ చేయక్కర్లేదని చెప్పి తీరాలి, ఎందుకంటే ఈ సినిమా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే ఈ సినిమా రానుందనే టాక్ నడుస్తుంది. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
గాడ్జిల్లా మైనస్ వన్ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే.. జపాన్ లో జరిగిన ఓ భారీ యుద్ధం తర్వాత.. గాడ్జిల్లా భూమిపైకి రావడం వలన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు మాత్రం విపరీతమైన రెస్పాన్స్ ను అందుకుంది. అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఆల్రెడీ విడుదల అయింది కానీ అది కేవలం జపాన్ సబ్‌స్క్రైబర్ల వరకు మాత్రమే పరిమితం అయింది. ఇక ఈ నెలలో ఇండియన్ ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరిలో గాడ్జిల్లా మైనస్ వన్ మూవీకి ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. ఇక ఈ సినిమా ఓటీటీ రీలిజ్ డేట్ పై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరి గాడ్జిల్లా మైనస్ వన్ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.