OTT లో మనకి తెలియని చరిత్ర చెప్పే వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

OTT Web Series: ఈ మధ్య ఓటీటీ లో కొత్త కాన్సెప్ట్స్ తో చాలానే ఇంట్రెస్టింగ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే మరొక కొత్త సిరీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అది కూడా ఇప్పటివరకు ఎవరు చూడని ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

OTT Web Series: ఈ మధ్య ఓటీటీ లో కొత్త కాన్సెప్ట్స్ తో చాలానే ఇంట్రెస్టింగ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే మరొక కొత్త సిరీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అది కూడా ఇప్పటివరకు ఎవరు చూడని ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

ఓటీటీ లకు క్రేజ్ బాగా పెరిగిన తర్వాత.. మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ ను దృష్టిలో ఉంచుకుని.. మేకర్స్ కూడా కొత్త కాన్సెప్ట్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓటీటీ లో ఇప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ.. మనకు తెలియని మన చరిత్ర గురించి చెప్పే కథ.. ‘ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’ అనే ఓ వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించడమే కాకుండా సిరీస్ పై ఆసక్తిని పెంచింది. మరి ఈ సిరీస్ లో దేని గురించి చెప్పబోతున్నారు. ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది. అనే విషయాలను చూసేయండి.

మహాత్మ గాంధీ చేసిన పోరాటానికి ఫలితంగా దేశానికీ స్వాతంత్రం వచ్చిన సంగతి తెలిసిందే. అసలు అప్పుడు ఏం జరిగింది? ఆ సమయంలో అధికారంలో ఉన్న పార్టీలో.. చివరి క్షణంలో జరిగిన మార్పులు ఏంటి ఇలా మనకి తెలియని ఎన్నో నిజా నిజాలను.. ఈ సిరీస్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. కాగా ఈ సిరీస్ కు నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ ఒరిజినల్ గా స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. దేశ స్వాతంత్రంతో పాటు.. జవహర్ లాల్ నెహ్రు దేశానికీ తొలి ప్రధాని ఎలా అయ్యారు.. ఆ సమయంలో అందరి మద్దతు సర్దార్ వల్లభాయ్ పటేల్ కే ఎందుకు దక్కింది. జవహర్ లాల్ నెహ్రు దేశానికీ ప్రధాని అవ్వడం వెనుక గాంధీ పాత్ర ఏదైనా ఉందా ఇలా చాలా విషయాలను ఈ సిరీస్ లో చూపించనున్నారు.

అయితే , 1975 లో లారీ కొలిన్స్, డొమినిక్ లాపియెర్ రాసిన ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ అనే బుక్ ను ఆధారంగా తీసుకుని.. ఈ సిరీస్ ను రూపొందించారు మేకర్స్. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. కానీ ఇంకా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇది కేవలం డ్రాప్ 1 అని ప్రకటనలు ఇస్తున్నారు. చూడబోతుంటే ఇంకా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కంటే ముందు ఇంకొన్ని వీడియోస్ ను రిలీజ్ చేసేలా ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే.. 1947లో దేశానికి ఎలా స్వాతంత్రం వచ్చింది , దేశం ఎలా విడిపోయింది దాని వెనుక ఉండే పూర్తి కథను ఈ సిరీస్ లో చూపించనున్నారు. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments