iDreamPost
android-app
ios-app

ఈ నెలలో ఈటీవీ విన్ లో 4 తెలుగు సినిమాలు.. OTT లవర్స్ కు పండగే

  • Published Sep 03, 2024 | 1:49 PM Updated Updated Sep 03, 2024 | 1:49 PM

ETV Win Upcoming Telugu Movies: ప్రతి వారం ఓటీటీ లోకి ఎన్ని సినిమాలు , సిరీస్ లు వచ్చినా కానీ.. ప్రేక్షకులు మాత్రం ముందుగా తెలుగు సినిమాల కోసం మాత్రమే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ నెలలో ఓటీటీ లోకి ఒకే ప్లాట్ ఫార్మ్ లో ఏకంగా మూడు తెలుగు సినిమాలు రానున్నాయి. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

ETV Win Upcoming Telugu Movies: ప్రతి వారం ఓటీటీ లోకి ఎన్ని సినిమాలు , సిరీస్ లు వచ్చినా కానీ.. ప్రేక్షకులు మాత్రం ముందుగా తెలుగు సినిమాల కోసం మాత్రమే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ నెలలో ఓటీటీ లోకి ఒకే ప్లాట్ ఫార్మ్ లో ఏకంగా మూడు తెలుగు సినిమాలు రానున్నాయి. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Sep 03, 2024 | 1:49 PMUpdated Sep 03, 2024 | 1:49 PM
ఈ నెలలో ఈటీవీ విన్ లో 4 తెలుగు సినిమాలు.. OTT లవర్స్ కు పండగే

ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యేందుకు చాలానే సినిమాలు , సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన లిస్ట్ ప్రకారం వాటిలో తెలుగు సినిమాలు తక్కువగా ఉన్నాయి. వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇలా ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ప్రేక్షకులు తెలుగు సినిమాలకే ముందు ప్రాధాన్యతను ఇస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెలలో ఒకే ప్లాట్ ఫార్మ్ లో మూడు తెలుగు సినిమాలు రానున్నాయి. కాబట్టి ఓటీటీ లవర్స్ కు ఇక పండగే. అది కూడా అచ్చ తెలుగు కంటెంట్ అందించే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో. మరి ఆ సినిమాలేంటో దానికి సంబంధించిన వివరాలేంటో చూసేద్దాం.

తాజాగా ఈటీవీ విన్ ప్లాట్ ఫార్మ్ తమ సోషల్ మీడియా ఖాతాలో.. సెప్టెంబర్ సర్ప్రైజ్ అంటూ.. ఈ నెలలో తమ ఓటీటీ లో రిలీజ్ కాబోయే సినిమాల గురించి అప్ డేట్ ఇచ్చేసింది. ఈ నెలలో ఈటీవీ విన్ లో రిలీజ్ కాబోయే తెలుగు సినిమాల జాబితా ఇలా ఉంది.

కమిటీ కుర్రాళ్ళు:

ఆగస్టు లో వచ్చిన నోస్టాలాజిక్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. ఈ మూవీ గురించి ఇప్పటికే చాలా వినేసి ఉంటారు. క్యాస్టింగ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరు కొత్త వారైనా సరే.. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. దీనితో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 5 నుంచి లేదా సెప్టెంబర్ 12 స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం.

సురాపానం:

ఇదేమి కొత్త సినిమా అయితే కాదు. ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి రెండేళ్లు అయింది. జూన్ 10, 2022 న రిలీజ్ అయినా ఈ సినిమా ఆ సమయంలో.. డీసెంట్ టాక్ నే సంపాదించుకుంది. ఆల్రెడీ ఈ మూవీ గతఏడాది నుంచి ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఓటీటీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రావడం విశేషం. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

వెల్‌కమ్ 2 లైఫ్ సిరీస్:

కొరియన్ సినిమాలను , సిరీస్ లను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. ఈ మధ్య అందరూ ఇంట్రెస్టింగ్ గా ఈ సిరీస్ లను చూస్తున్నారు. ఇక ఇప్పుడు ఈటీవీ విన్ ఓలో కూడా ఓ ఇంట్రెస్టింగ్ కొరియన్ సిరీస్.. వెల్కమ్ 2 లైఫ్.. తెలుగులో కూడా రానుంది. ఓ ప్రమాదం వలన మరొక ప్రపంచంలోకి వెళ్లే ఓ లాయర్ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక ఈ సిరీస్ లు , సినిమాలు కాకుండా ఈటీవీ విన్ ఒరిజినల్ గా సోపతులు మూవీ కూడా రానుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ను ప్రకటించనున్నారు మేకర్స్ . కాబాట్టి ఈ నెలలో ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు రాబోయే ఈ సిరీస్ లను , సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మంత్ ఎండ్ లోపు మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాల అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetHoliganbet girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet giriş