iDreamPost
android-app
ios-app

రూ.29కే ETV Win OTT సబ్ స్క్రిప్షన్.. ఆఫర్ కేవలం 3 రోజులే..

  • Published Aug 27, 2024 | 3:57 PM Updated Updated Aug 27, 2024 | 3:57 PM

ETV Win OTT Montly Subscription: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఆయా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు సబ్స్క్రిప్షన్స్ కూడా బాగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ తక్కువ ధరలకు సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ETV Win OTT Montly Subscription: ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఆయా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు సబ్స్క్రిప్షన్స్ కూడా బాగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ తక్కువ ధరలకు సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 27, 2024 | 3:57 PMUpdated Aug 27, 2024 | 3:57 PM
రూ.29కే ETV Win OTT సబ్ స్క్రిప్షన్.. ఆఫర్ కేవలం 3 రోజులే..

ప్రతి వారం ఓటీటీ లో చాలా సినిమాలు , సిరీస్ లు వస్తూ ఉన్నాయి . దీనితో అన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు సబ్ స్క్రిప్షన్ తీసుకోవడం కాస్త కష్టమే. అందులోను సబ్ స్క్రిప్షన్ ధరలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఈ క్రమంలో వినియోగదారులకు వెసులుబాటు కలిగించేలా గతంలో జియో సినిమా ప్లాట్ ఫార్మ్ తక్కువ ధరలకు సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ అందించింది. ఇక ఇప్పుడు అచ్చ తెలుగు కంటెంట్ అందించే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్.. ఈటీవీ విన్ సరికొత్త సబ్ స్క్రిప్షన్ ఆఫర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈ ఆఫర్ ఏంటి.. దానికి సంబంధించిన పూర్తి విషయాలను చూసేద్దాం.

ఈటీవీ విన్ ప్లాట్ ఫార్మ్.. తాజాగా కొత్త సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. దేనికోసం అంటే.. ఈటీవీ 29వ వారిషోత్సవం సంధర్బంగా.. తక్కువ ధరకే సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. ఈ విషయాన్నీ తాజాగా తమ సోషల్ మీడియా వేదిక ద్వారా “ఈటీవీ విన్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ కేవలం రూ.29 మాత్రమే. మీ రోజువారీ సామాన్ల కంటే తక్కువ ధరలో.. ఈ ఆఫర్ కేవలం ఆగస్ట్ 27, 28, 29 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది” అనే క్యాప్షన్ తో అనౌన్స్ చేసింది. అయితే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉండనుంది. 27,28,29 తేదీల్లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. సాధారణంగా ఇప్పటివరకు నెలకు రూ.99, సంవత్సరానికి రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇప్పడు చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉంది కాబట్టి.. ఈ ఆఫర్ ను అసలు మిస్ చేయకుండా ఉపయోగించుకోండి.

ఇప్పటికే ఈటీవీ విన్ లలో ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడమే కాకుండా.. ట్రెండింగ్ లోకి కూడా వస్తున్నాయి. ఇక ఆ సినిమాలతో పాటు ఈటీవీ విన్ ఒరిజినల్స్ అంటూ.. మరి కొన్ని సినిమాలు కూడా పాపులర్ అవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో ఈటీవీ విన్ నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు , సిరీస్ లు వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇప్పుడు తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఈ ఆఫర్ ను ఉపయోగించుకుని.. ఎంచక్కా ఆ సిరీస్ లను చూసేయండి.  ఓ రకంగా ఈ విధంగా చేయడం ద్వారా సబ్ స్క్రైబర్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి మిగిలిన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కూడా ఇలాంటి ఆఫర్స్ ను తీసుకొస్తాయేమో చూడాలి.  మరి ఈటీవీ విన్ అందిస్తున్న ఈ ఆఫర్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by ETV Win (@etvwin)