Swetha
OTT Movie : ఓటీటీ లకు ఈ రేంజ్ లో క్రేజ్ పెరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఒకదానికి మించి మరొక అప్ డేట్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
OTT Movie : ఓటీటీ లకు ఈ రేంజ్ లో క్రేజ్ పెరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఒకదానికి మించి మరొక అప్ డేట్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.
Swetha
ఇప్పటికే ఓటీటీ లో ఉన్న సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఓ వారం ముందు నుంచే ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మూవీ లవర్స్ కు షెడ్యూల్ బిజీ చేయడానికి ఇంకొన్ని కొత్త సినిమాలు ఓటీటీ లో ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. ఓటీటీ లకు ఈ రేంజ్ లో క్రేజ్ పెరుగుతుందని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే ఒకదానికి మించి మరొక అప్ డేట్ వచ్చేస్తుంది. పైగా కొన్ని ఇతర భాషల చిత్రాలను తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు తీసుకుని వచ్చేస్తున్నారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్, డిఫరెంట్ ప్రేమ కథ చిత్రం.. ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. అది కూడా థియేటర్ లో రిలీజ్ అయినా రెండు నెలల తర్వాత ఓటీటీ లోకి వచ్చేస్తుంది. మరి ఆ మూవీ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా మరేదో కాదు.. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ ఒబెరాయ్, కనక్ బుధిరాజా హీరో హీరోయిన్స్ గా నటించిన.. “ఏక్ కోరీ ప్రేమ్ కథ”. ఈ సినిమా ఏప్రిల్ 5 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ అంతా కూడా సమాజంలో జరుగుతున్న ఓ దురాచారంపైన ఓ అమ్మాయి చేసే పోరాటం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఓ సీరియస్ సబ్జెక్టు పైన వచ్చిన ఈ సినిమా.. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. థియేటర్స్ లో డీసెంట్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను.. జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సొంతం చేసుకోగా.. జూలై 25 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకుని రానున్నారు. ఈ విషయాన్నీ స్వయముగా జియో సినిమా ప్లాట్ ఫార్మ్.. “కొత్త ఆలోచన.. అమితమైన ధైర్యం గురించిన కథ ఇది. ఏక్ కోరీ ప్రేమ్ కథను జూలై 25 నుంచి జియోసినిమాలో చూసేయండి” అంటూ ప్రకటించింది.
ఇక ఏక్ కోరీ ప్రేమ్ కథ స్టోరీ విషయానికొస్తే .. ఈ సినిమాను కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. ఉత్తర్ ప్రదేశ్‍లోని లక్ష్మణ్‍గంథ్ గ్రామంలో ఈ మూవీ కథ సాగుతుంది. ఈ గ్రామానికి రామ్‍దేవ్ సింగ్ అనే అతను సర్పచ్ గా ఉంటాడు. అయితే అతని కొడుకుకు.. సభ్యత అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. అయితే పెళ్ళి తర్వాత ఆమెకు కన్యత్వ పరీక్ష జరిపించాలని.. సర్పంచ్ సహా అనేక మంది పెద్దలు సలహాలు ఇస్తారు. కానీ దీనికి ఆమె ఒప్పుకోదు. ఇది తప్పని దానిని వ్యతికేరిస్తూ పోరాడుతుంది. ఈ క్రమంలో తన భర్తకు కూడా దూరం అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది ? ఆమె ఈ దురాచారాన్ని ఆపగలిగిందా లేదా ? అనేది ఈ మూవీ కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.