iDreamPost
android-app
ios-app

OTT లోకి హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎక్కడంటే!

  • Published Jul 18, 2024 | 12:23 PM Updated Updated Jul 18, 2024 | 12:23 PM

Dune2 OTT Streaming In Telugu: హాలీవుడ్ మూవీస్ ను తెలుగులో చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో... ఓ ప్రముఖ హాలీవుడ్ మూవీ తెలుగులోకి ఓటీటీ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కు రానుంది అనే విషయాలను చూసేద్దాం.

Dune2 OTT Streaming In Telugu: హాలీవుడ్ మూవీస్ ను తెలుగులో చూడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో... ఓ ప్రముఖ హాలీవుడ్ మూవీ తెలుగులోకి ఓటీటీ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కు రానుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Jul 18, 2024 | 12:23 PMUpdated Jul 18, 2024 | 12:23 PM
OTT లోకి  హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులో కూడా స్ట్రీమింగ్.. ఎక్కడంటే!

ప్రతి వారం ఓటీటీ లోకి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయినా కానీ.. వాటిలో చాలా మంది తెలుగు సినిమాలు ఏం ఉన్నాయా అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు నేరుగా తెలుగులో చాలానే సినిమాలు వస్తున్నాయి. అవి కాకుండా ఇప్పుడు ఓటీటీ లో తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆదరణను చూసి మలయాళ , తమిళ సినిమాలు కూడా తెలుగులో స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు. ఎంతైనా ఇతర భాషల్లో హిట్ అయినా సినిమాలను తెలుగులో చూస్తే ఆ కిక్ ఏ వేరు అనుకుంటూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో హాలీవుడ్ లో హిట్ అయినా డ్యూన్ 2 మూవీ ఓటీటీ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీ లోకి రానుందో.. ఎప్పుడో రానుందో చూసేద్దాం.

హాలీవుడ్ లో రిలీజ్ అయినా డ్యూన్ 2 మూవీకి.. భారీ స్పందన లభించింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది .ప్రపంచ వ్యాప్తంగా భారీ రికార్డ్స్ ను కొల్లగొట్టిన ఈ మూవీ.. మార్చి1 న థియేటర్ లో రిలీజ్ అయింది. డ్యూన్ మొదటి పార్ట్ కు అనుకోని ఆదరణ లభించడంతో.. దానికి సిక్వెల్ గా డ్యూన్ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు మేకర్స్. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ లోకి అడుగుపెట్టనుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమా సొంతం చేసుకోగా.. ఆగష్టు 1 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసురానున్నారు. పైగా ఈ సినిమాను ఇంగ్లీష్ తో పాటు.. తెలుగు, హిందీ, తమిళం , కన్నడ, బెంగాలీ , మరాఠీ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు.. ఎంచక్కా ఓటీటీ లో తెలుగులో కూడా చూసేయండి.

అయితే , ఇప్పటికే ఈ సినిమా ఇంగ్లిష్ లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్ , బుక్ మై షో లలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ అక్కడ రెంట్ పద్దతిలో దీనిని వీక్షించవచ్చు. కానీ ఇప్పుడు జియో సినిమాలో అటువంటివేమీ లేకుండా.. చూసేయొచ్చు. పైగా ఇక్కడ తెలుగులో కూడా చూడొచ్చు. ఇక ఈ మూవీలో తిమోతీ చాలమెట్, జెండియా, రెబకా ఫెర్గ్యూసన్ లతో పాటు.. జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్, ఫ్లోరెన్స్ పగ్, డేవ్ బటిస్టా, క్రిస్టోఫర్ వాకెన్ ముఖ్య పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాకు డెనిస్ విల్లెనేయువే దర్శకత్వం వహించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetcasinolevant girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio