iDreamPost
android-app
ios-app

Best Suspense Thriller In OTT: చనిపోయిన వ్యక్తిని బతికించడానికి ఫ్యామిలీ అంతా ఆత్మహత్య! OTTలో వింత సినిమా!

  • Published May 31, 2024 | 5:55 PMUpdated May 31, 2024 | 5:55 PM

OTT Movie Suggestion- Best Suspense Thriller: హర్రర్ సినిమాల కోసం కేవలం హాలీవుడ్ సినిమాలనే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో కూడా హర్రర్ కంటెంట్ తో ఉండే సినిమాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఓ తెలుగు సినిమానే. మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

హార్రర్ సినిమాలను అందరూ ఇష్టపడుతున్న మాట వాస్తవమే కానీ.. దాదాపు హర్రర్ పిక్చర్స్ అంటే అందరూ హాలీవుడ్ సినిమాలనే చూస్తూ ఉంటారు. కానీ తెలుగులో కూడా అదే రేంజ్ లో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చే హర్రర్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ హర్రర్ సినిమా గురించే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే.. ఓ మంచి తెలుగు హర్రర్ సినిమాను మిస్ అయినట్లే. మరి మీరు మిస్ చేసిన మూవీస్ లో ఈ మూవీ కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి . మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమాలో హేమంత్ అనే అతను ఓ అనాధ. అతను తన ఫ్రెండ్ తో కలిసి ఓ కాఫీ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. ఇక అతని షాప్ కు కుకీస్ సప్లై చేస్తూ ఉంటుంది చైత్ర అనే అమ్మాయి. ఈ క్రమంలో హేమంత్ చైత్రతో ప్రేమలో పడతారు. దీనితో హేమంత్ చైత్రను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ చైత్ర మాత్రం అతని ప్రపోజల్ కు నో చెప్తుంది. ఎందుకని ఆరా తీయగా .. కొద్దీ రోజులలో తన ఫ్యామిలీ అంతా సూసైడ్ చేసుకుంటున్నట్లు చెప్పి షాక్ ఇస్తుంది. కారణం ఏంటి అని అడిగితే.. ఓ యాక్సిడెంట్ లో చనిపోయిన వారి పెదనాన్నను తిరిగి బ్రతికించడానికి తాము ఆత్మతర్పణం చేసుకుంటున్నామని అంటుంది. దీనితో హేమంత్ పిచ్చిగా ఈ పని చేస్తున్న చైత్రతో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని సేవ్ చేయాలనీ ఫిక్స్ అవుతాడు. చైత్రను పెళ్లి చేసుకుని ఆ ఇంటికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్లిన హేమంత్ కు ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి ? చైత్ర కుటుంబాన్ని వాళ్ళ పెదనాన్న ఆత్మ ఆవహించిందా ? అసలు వారంతా సూసైడ్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు ? కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకోవడాన్ని హేమంత్ ఆపగలుగుతాడా ? ఇవన్నీ తెలియాలంటే “ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ ” అనే ఈ సినిమాను చూడాల్సిందే.

నమ్మకాలు, విశ్వాసాలు మూఢ నమ్మకాలుగా మారితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అనే కాన్సెప్ట్ ను ఈ సినిమాలో చూపించారు మేకర్స్. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ , లేదా ఓ మిస్టరీ కేస్ ను సాల్వ్ చేయడం ఇలా అనేక రకాల ప్లాట్స్ ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా ఓ మంచి ఇంట్రెస్టింగ్ ఫీల్ ఇస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి