iDreamPost
android-app
ios-app

Best Suspense Thriller In OTT: ఊరిలో చిన్నపిల్లల కిడ్నాప్స్! మనం చిన్నప్పుడు విన్న బూచోడి కథ OTTలో!

  • Published May 18, 2024 | 6:32 PM Updated Updated May 18, 2024 | 6:32 PM

OTT Movie Suggestion: హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటె కనుక వెంటనే చూసేయండి . మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT Movie Suggestion: హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చేస్తుంది. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ అయ్యి ఉంటె కనుక వెంటనే చూసేయండి . మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published May 18, 2024 | 6:32 PMUpdated May 18, 2024 | 6:32 PM
Best Suspense Thriller In OTT: ఊరిలో చిన్నపిల్లల కిడ్నాప్స్! మనం చిన్నప్పుడు విన్న బూచోడి కథ OTTలో!

థ్రిల్లర్ సినిమాలంటే సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కదలకుండా కూర్చుని చూసేలా ఉండాలి. థ్రిల్లర్ జోనర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మాత్రం కాస్త డిఫ్ఫరెంట్. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్ అని చెప్పి తీరాలి. ఈ సినిమాను ఇప్పటివరకు ఎవరైనా మిస్ చేసి ఉంటె మాత్రం వెంటనే చూసేయండి. ఒకవేళ ఆల్రెడీ చూసేసి ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఓ వర్త్ వాచింగ్ సినిమా ఇది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో.. ఈ సినిమా కథేంటో చూసేద్దాం.

హర్రర్ సినిమాలలో దెయ్యం భయపెడితే.. థ్రిల్లర్ మూవీస్ లో మనుషులే భయపెడతారని ఇప్పటివరకు చాలా సినిమాలు నిరూపించాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమానే. ఈ సినిమా పేరు “ఐ సి యు”. ఈ సినిమాలో హర్రర్ ఎలెమెంట్స్ తో పాటు థ్రిల్లర్ ఎలెమెంట్స్ కూడా ప్రేక్షకులను చివరి వరకు ఎంగేజింగ్ గా ఉంచుతాయి. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు విల్లన్ ఎవరు అనే ట్విస్ట్ ఈ సినిమాకు హైలెట్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ సినిమాను చూడని వారు ఈ పర్ఫెక్ట్ థ్రిల్లర్ ను అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి. అసలు ఏంటి ఈ సినిమా ఎందుకు చూడాలి . ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.

ఈ సినిమా కథేంటంటే.. ఓ పదేళ్ల అబ్బాయి స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్న దారిలో.. తనను వెననుంచి ఎవరో లాగినట్లు అనిపిస్తుంది. అప్పటినుంచి అతను కనిపించకుండా పోతాడు. అతనితో పాటు మరొక అబ్బాయి కూడా కనిపించకుండా పోతాడు. దీనితో ఈ మిస్సింగ్ కేసును ఛేదించడానికి.. గ్రెగ్ అనే ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. అతనికి పెళ్లి అయ్యి ఓ కొడుకు కూడా ఉంటాడు. ప్రొఫెషనల్ గా అతను మంచి ఆఫీసర్ కానీ, పర్సనల్ లైఫ్ లో మాత్రం అతను చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటు ఉంటాడు. అతని భార్యకు ఓ వివేహేతర సంబంధం ఉంటుంది. ఈ విషయం గ్రెగ్ కు అతని కొడుకుకు తెలిసినా కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఇది ఇలా ఉంటె ఊరిలో మిస్ అయిన పిల్లల కోసం వెతుకుతున్న క్రమంలో.. వాళ్లకి ఓ కత్తి దొరుకుతుంది. చాలా ఏళ్ళ క్రితం ఇదే తరహాలో ఓ సైకో కిల్లర్ పిల్లలను కిడ్నప్ చేసి కత్తిని వదిలి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు అతను జైలులో ఉండడంతో.. ఈ కిడ్నప్ ఎవరు చేసారా అనేది ఎవరికీ అంతుచిక్కదు. అసలు ఆ కిడ్నపర్ ఎవరు అనేది ఈ మూవీ క్లైమాక్స్ చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.