iDreamPost
android-app
ios-app

OTT Movie Suggestion: భర్త సరిగ్గా చూసుకోవట్లేదని ప్రియుడితో! పూర్ణ ఇలాంటి సినిమా చేసింది అంటే నమ్మలేరు!

  • Published May 18, 2024 | 3:25 PM Updated Updated May 18, 2024 | 3:25 PM

హర్రర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి హర్రర్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. పైగా ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన నటి అందరికి పరిచయమే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

హర్రర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి హర్రర్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. పైగా ఈ సినిమాలో మెయిన్ లీడ్ లో నటించిన నటి అందరికి పరిచయమే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published May 18, 2024 | 3:25 PMUpdated May 18, 2024 | 3:25 PM
OTT Movie Suggestion: భర్త సరిగ్గా చూసుకోవట్లేదని ప్రియుడితో! పూర్ణ ఇలాంటి సినిమా చేసింది అంటే నమ్మలేరు!

కొన్ని సినిమాలను చూస్తే ఈ సినిమాను ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. దాదాపు ఓటీటీ లో ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు వస్తున్నాయా అని అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఆ లిస్ట్ లో ఈ సినిమా పేరు కూడా వినే ఉంటారు. ఈ సినిమా అప్ డేట్ చూసి కూడా ఈ సినిమాను చూడడం మిస్ అయ్యి ఉంటే మాత్రం ఓ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ను మిస్ అయినట్లే. ఈ మధ్య కాలంలో భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూస్తున్నారు కాబట్టి. ఈ సినిమా ఈజీగానే అర్థమైపోతుంది. మరి ఈ సినిమా ఏంటీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు “డెవిల్”. ఈ మూవీ నేమ్ ని చూసి ఇదొక హర్రర్ మూవీ అని అనుకుంటారు. అవును కానీ ఇందులో దెయ్యం మాత్రం ఉండదు. అయితే సస్పెన్స్ లు, ట్విస్ట్ లు మాత్రం బాగానే ఉంటాయి. ఈ మూవీకి.. డైరెక్టర్ ఆథియా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో ప్రముఖ నటి పూర్ణ లీడ్ రోల్ లో నటించింది. అటు పూర్ణ తో పాటు.. టాలీవుడ్ హీరో త్రిగుణ్ కీల‌క పాత్ర పోషించాడు. కాగా, విదార్థ్ హీరోగా న‌టించాడు. అయితే, ఫిబ్రవరి 2న ఈ సినిమా థియేటర్ లో విడుదలైంది. కానీ, ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీ లో మాత్రం ఈ సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ చేస్తే మాత్రం వెంటనే చూసేయండి. ఇక ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే..

ఈ సినిమాలో పూర్ణ ఒక హౌస్ వైఫ్ క్యారక్టర్ లో నటించింది. ఆమె చుట్టూనే ఈ మూవీ కథ కొనసాగుతుంది. పూర్ణ భర్త హస్బెండ్ ఓ ఫేమస్ లాయర్. అతను పెళ్లికి ముందు నుంచే ఆఫీస్ లో ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. ఇక పెళ్లి తర్వాత కూడా భార్యను ఇంట్లో ఉంచుకుని ఆఫీస్ లో ఆ అమ్మాయితో రిలేషన్ షిప్ కొనసాగిస్తాడు. ఇది ఇలా ఉంటె మరో వైపు ఓ యాక్సిడెంట్ ద్వారా రోషన్ అనే వ్యక్తి పూర్ణ లైఫ్ లోకి వస్తాడు. పూర్ణ అతనిని దగ్గరుండి చూసుకోవడంతో.. ఆ యాక్సిడెంట్ ద్వారా రోషన్ కు పూర్ణపై ప్రేమ కలుగుతుంది. కానీ పూర్ణ ఆమెకు పెళ్లయిందని చెప్పినా కూడా రోషన్ మాత్రం వినడు. కట్ చేస్తే ఆఫీస్ లో ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉన్న పూర్ణ భర్తను ఆ అమ్మాయి మోసం చేస్తుంది. దీనితో తన తప్పు తెలుసుకున్న పూర్ణ భర్త.. పూర్ణతో ఇకపై మంచిగా ఉంటానని ప్రామిస్ చేస్తాడు. ఇక అప్పటినుంచి వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు.

కానీ ఈలోపే రోషన్ పూర్ణకు కాల్స్ చేస్తూ.. ఆమెను చూడాలని ఆమె ఇంటికి వెళ్తాడు. ఈ విషయం పూర్ణ భర్తకు తెలుస్తుంది, ఆ తర్వాత ఎం జరిగింది? పూర్ణ , రోషన్ ల మధ్య ఎటువంటి బంధం కొనసాగింది? పూర్ణ భర్త వారిద్దరిని ఏం చేశాడు ? చివరికి ఈ స్టోరీ ఎలా ముగిసింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. తర్వాత ఏం జరుగుతుందా అనే సస్పెన్స్ తో ఈ సినిమా చివరి వరకు ఎంగేజింగ్ గా కొనసాగుతుంది. మరి ఈ సినిమాపై మీ అభ్భిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş