iDreamPost
android-app
ios-app

OTT Suggestion: వర్జిన్ అమ్మాయిలే ఆత్మ టార్గెట్! OTTలోని ఈ హార్రర్ మూవీని అమ్మాయిలు చూడొద్దు!

  • Published Apr 30, 2024 | 6:47 PM Updated Updated Apr 30, 2024 | 6:47 PM

హర్రర్ సినిమాలంటే ప్రతి ఒక్కరు ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. పైగా అవి తెలుగులోనే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసినా కూడా.. ఈ సినిమా మాత్రం కాస్త డిఫ్ఫరెంట్ అని చెప్పి తీరాలి.

హర్రర్ సినిమాలంటే ప్రతి ఒక్కరు ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. పైగా అవి తెలుగులోనే ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎన్నో హర్రర్ సినిమాలను చూసినా కూడా.. ఈ సినిమా మాత్రం కాస్త డిఫ్ఫరెంట్ అని చెప్పి తీరాలి.

  • Published Apr 30, 2024 | 6:47 PMUpdated Apr 30, 2024 | 6:47 PM
OTT Suggestion: వర్జిన్ అమ్మాయిలే ఆత్మ టార్గెట్! OTTలోని ఈ హార్రర్ మూవీని అమ్మాయిలు చూడొద్దు!

హర్రర్ సినిమాలను చూసేందుకు ఇప్పుడు అందరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒక హర్రర్ సినిమా వస్తుంది అంటే ఎంత భయం వేసినా కానీ.. ఒంటరిగా కూర్చుని చూసే సాహసాలు చేస్తున్నారు మూవీ లవర్స్. దీనితో మేకర్స్ కూడా ఆయా జోనర్స్ కు తగిన సినిమాలను ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక హర్రర్ కంటెంట్ జోనర్ లో ఇప్పటివరకు ఉన్న సినిమాలన్నీ ఒకటైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కాస్త డిఫ్ఫరెంట్. భాష సంగతి పక్కన పెట్టేస్తే.. కథ ఈ సినిమా చెమటలు పట్టించడం ఖాయం అని చెప్పి తీరాలి. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందో చూసేద్దాం.

ఈ సినిమా పేరు “ది బ్రైడ్”. 2017 లో ఈ సినిమా విడుదలైంది. చనిపోయిన ఆత్మలను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసే సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఈ సినిమా కూడా అలాంటిదే . కానీ, ఈ సినిమాలో మాత్రం అదే ప్రయత్నం అతనికి శాపంలా మారి.. ఆ శాపం కొన్ని తరాల పాటూ వేధిస్తుంది. ఆ శాపం నుంచి ఆ కుటుంబం ఎలా తప్పించుకోగలిగింది అనేది ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ గా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా.. వెన్నులో వణుకు పుట్టించే విజువల్స్ తో కథను ముందుకు తీసుకువెళ్లారు. హర్రర్ సినిమాలంటే ఇష్టం ఉన్న వాళ్లకు.. ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి, ఈ సినిమా ఆపిల్ టీవీ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంది. అసలు ఈ సినిమా కథేంటో చూసేద్దాం.

ఈ సినిమా స్టార్టింగ్ లో 1800 ల్లో తన కెమరాతో ఓ హర్రర్ ప్రయోగాన్ని చేయాలని.. సిద్ధం అవుతూ ఉంటాడు ఓ ఫోటోగ్రాఫర్. ఆ కెమరాతో చనిపోయిన వ్యక్తులను ఫోటోలు తీసి.. వారి ఆత్మలను బ్రతికి ఉన్న వారి శరీరంలోకి పంపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అనుకోకుండా తన భార్య చనిపోతుంది. దీనితో తన భార్య ఆత్మను కూడా అలానే మరొకరి శరీరంలోకి పంపించాలనే ప్రయత్నం చేస్తాడు. తానూ అనుకున్నట్లుగానే ఓ అమ్మాయి శరీరంలోకి తన భార్య ఆత్మను ప్రవేశ పెడతాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అతను అనుకున్నట్లుగా అది అతని భార్య ఆత్మ కాదు. వేరే ఎదో చెడు ఆత్మ. ఆ కుటుంబానికి ఆ ఆత్మ ఏ హాని చేయకుండా ఉండాలంటే.. ఎప్పటికప్పుడు ఓ వర్జిన్ అమ్మాయిని బలి ఇవ్వాలని కోరుతుంది. కట్ చేస్తే.. 2017 లో ఆ వంశానికి చెందిన ఓ అతను కొత్తగా పెళ్ళైన తన భార్యను తీసుకుని అదే ఇంటికి వస్తాడు. అదే ఇంట్లో అప్పటికే ఉన్న ఆత్మ కన్ను.. ఆ అమ్మాయి మీద పడుతుంది. మరి ఆ ఆత్మ నుంచి వీరు ఎలా బయటపడ్డారు! ఆ తర్వాత ఏమైంది ! ఆ ఆత్మ ఆ ఇంటిని వదిలి వెళ్లిందా లేదా! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş