iDreamPost
android-app
ios-app

OTT Suggestion: ఆ అమ్మాయికే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? OTTలో ఇలాంటి హార్రర్ మూవీ చూసుండరు!

  • Published Apr 26, 2024 | 7:06 PM Updated Updated Apr 26, 2024 | 7:06 PM

తెలుగులో వచ్చే హర్రర్ , సస్పెన్స్ సినిమాలంటే అందరు ఇంట్రెస్ట్ గానే చూస్తుంటారు. కానీ, ఒక్కసారి లాంగ్వేజ్ ని పక్కన పెట్టేస్తే .. ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ మీ సొంతం. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇటువంటిదే.

తెలుగులో వచ్చే హర్రర్ , సస్పెన్స్ సినిమాలంటే అందరు ఇంట్రెస్ట్ గానే చూస్తుంటారు. కానీ, ఒక్కసారి లాంగ్వేజ్ ని పక్కన పెట్టేస్తే .. ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ మీ సొంతం. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఇటువంటిదే.

  • Published Apr 26, 2024 | 7:06 PMUpdated Apr 26, 2024 | 7:06 PM
OTT Suggestion: ఆ అమ్మాయికే ఆత్మలు ఎందుకు కనిస్తాయ్? OTTలో ఇలాంటి హార్రర్ మూవీ చూసుండరు!

హర్రర్ సినిమాలను చూసేందుకు ఇప్పుడు అందరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒక హర్రర్ సినిమా వస్తుంది అంటే ఎంత భయం వేసినా కానీ.. ఒంటరిగా కూర్చుని చూసే సాహసాలు చేస్తున్నారు మూవీ లవర్స్. దీనితో మేకర్స్ కూడా ఆయా జోనర్స్ కు తగిన సినిమాలను ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక హర్రర్ కంటెంట్ జోనర్ లో ఇప్పటివరకు ఉన్న సినిమాలన్నీ ఒకటైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మరొక లెవెల్. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని వారాల పాటు మైండ్ లో తిరుగుతూ ఉండడం పక్కా అని చెప్పి తీరాల్సిందే. మరి ఇంతకీ ఈ సినిమా ఏంటి ఎక్కడ చూడాలి అనే విషయాల గురించి చూసేద్దాం.

ఈ సినిమా పేరు “థర్డ్ ఐ”. 2017 లో విడుదలైన ఒక ఇండోనేషియా హర్రర్ చిత్రం ఇది. ఈ సినిమా తెలుగులో అందుబాటులో లేకపోయినా కూడా.. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే మాత్రం అసలు ఆపారు. తర్వాత ఏమి జరుగుతుంది అసలు ఆ సన్నివేశాలు జరగడానికి గల కారణాలేంటి ఇలా.. ప్రతి ఒక్కటి కూడా ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటాయి. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమాను ఎందుకు చూడాలి. అసలు ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే.. ఈ సినిమాలో ఒక చిన్న పాపాకు తప్ప మిగిలిన ఎవరికీ దెయ్యాలు కనిపించవు. ఎవరికైనా రెండు కళ్ళే ఉంటాయి. కానీ ఆమెకు మాత్రం మూడవ కన్ను కూడా ఉంటుంది. దాని వలెనే ఆమె దెయ్యాలను చూస్తుందని అనుకుంటూ ఉంటారు అంతా.

అసలు కథేంటంటే.. ఆలియా, అబెల్ అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉంటారు. అబెల్ కు థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఉంటుంది. అయితే అబెల్ కు ఐదేళ్ల వయస్సు నుంచి వింత వింత ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆమె మాటలు మాత్రం ఎవరు నమ్మరు. ఆమె ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని వాటిని ఇంట్లో నుంచి తరిమివేయాలని చెప్తుంది. అనుకోకుండా ఓ రోజు అబెల్ మీద ఒక వింత ఆకారం ఘోరంగా అటాక్ చేస్తుంది. దీనితో అబెల్ భయపడడంతో వారు ఆ ఇంటిని ఖాళీ చేస్తారు. కానీ కొన్ని రోజులు వారి పేరెంట్స్ ఓ యాక్సిడెంట్ లో చనిపోవడంతో తిరిగి అదే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. ఆమెకు మళ్ళీ అక్కడ దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. దీనితో ఆలియా ఆమెను ఒక మంత్రగత్తె దగ్గరకు తీసుకు వెళ్లగా.. అప్పుడు అసలు నిజం బయటపడుతుంది. ఆ తర్వాత నుంచి అలియా కూడా దెయ్యాలు కనిపించడం మొదలవుతాయి. ఇక్కడ నుంచి కథ రకరకాల మలుపులు తిరుగుతుంది. అసలు దెయ్యాలు ఎందుకు కనిపిస్తున్నాయి , చివరకు ఏం అవుతుంది .. ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetelitcasinofixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet